తెలంగాణాలో కొత్త చరిత్ర నమోదు అవుతుందా!

బిఆర్ఎస్ అధినేత, సీఎం కెసిఆర్ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయటం తోనే ప్రజల్లో పలు అనుమానాలు తలెత్తాయి. అయితే ఇప్పుడు కెసిఆర్ ను ఓడించి తెలంగాణ సువెందు అధికారి అయ్యేది ఈటల రాజేందరా లేక టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డా అన్నది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే కెసిఆర్ ను ఈటల గజ్వేల్ లో ఢీకొడుతుంటే...కెసిఆర్ పోటీ చేస్తున్న రెండవ నియోజకవర్గం కామారెడ్డి లో ఆయనపై రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. కెసిఆర్ ను అయన పోటీ చేస్తున్న రెండు నియోజకవర్గాల్లో ఏ ఒక్క చోట..ఎవరు వోడించినా అది పెద్ద సంచలనమే అవుతుంది. తెలంగాణ రాజకీయాల్లో వాళ్ళు కొత్త చరిత్రను రాసినట్లు అవుతుంది. అయితే ఈ ప్రయత్నంలో ఈటల రాజేందర్, రేవంత్ రెడ్డి లు ఎంత మేర విజయం సాదించగలరో వేచిచూడాల్సిందే. కెసిఆర్ పై ఇద్దరు కీలక నేతలు పోటీ చేస్తుండటంతో పరువు ఆయా నియోజకవర్గాలపై బిఆర్ఎస్ ఎన్నడూ లేని రీతిలో ప్రత్యేక ఫోకస్ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.