Telugu Gateway
Telangana

ఆలోచన లేకుండా..అకస్మాత్తు నిర్ణయాలేంటి?

ఆలోచన లేకుండా..అకస్మాత్తు నిర్ణయాలేంటి?
X

తెలంగాణ సర్కారు ప్రకటించిన హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఇప్పటి వరకూ కనీసం వీకెండ్‌ లాక్‌డౌన్‌ ఆలోచన కూడా చేయని మీరు ఇంత అకస్మాత్తుగా నిర్ణయం తీసుకోవడం ఏమిటని కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఇంత తక్కువ సమయంలో ఇతర ప్రాంతాల వాళ్లు వారి ప్రాంతాలకు ఎలా వెళ్తారు అని కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. తెలంగాణ సర్కారు కరోనా కట్టడి కోసం రాష్ట్రంలో బుధవారం నుంచి పది రోజుల పాటు లాక్ డౌన్ అమలు చేయాలని నిర్ణయించింది. దీనిపైనే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వలస కూలీలు..రోజువారీ కూలీల పరిస్థితి ఏంటని ప్రశ్నించింది.

లాక్‌డౌన్‌ సందర్భంగా ఎమర్జెన్సీ పాస్‌లు ఇస్తామని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. సరిహద్దుల వద్ద అంబులెన్స్ నిలిపివేతకు సంబంధించి ఏమైనా ఆదేశాలు ఉన్నాయా అన్న కోర్టు ప్రశ్నకు.. ఏజీ లిఖితపూర్వక ఆదేశాలు లేవన్నారు. ఈ క్రమంలో కోర్టు మరి ఓరల్ ఆర్డర్స్ ఉన్నాయా అని ప్రశ్నించగా.. సీఎస్‌ను అడిగి చెప్తానన్నారు. ఇక సరిహద్దులో అంబులెన్స్‌ లను నిలిపి వేయవద్దని కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ యధావిధిగా కొనసాగించాలని ప్రభుత్వానికి సూచించింది.

Next Story
Share it