Telugu Gateway
Telangana

కొప్పుల ఈశ్వర్...వేముల ప్రశాంత్ రెడ్డి లకు అవమానం!

కొప్పుల ఈశ్వర్...వేముల ప్రశాంత్ రెడ్డి లకు అవమానం!
X

ప్రతిష్టతికమైన అంబేద్కర్ విగ్రహావిష్కరణ సమయంలో తెలంగాణ సర్కారు ఇచ్చిన ఫుల్ పేజీ యాడ్స్ లో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఫోటో వేయలేదు. ఆదివారంనాడు అట్టహాసంగా జరిగిన అంబేద్కర్ సచివాలయం ప్రారంభోత్సవంలో ఈ పనులు దగ్గరుండి పరిశీలించిన...సంబంధిత శాఖ ఆర్అండ్ బి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విషయంలోనే అలాగే జరిగింది. ఫుల్ పేజీ లో ఒక్క సీఎం తప్ప సంబంధిత శాఖల మంత్రుల ఫోటోలు మచ్చుకు అయినా వేయలేదు. ఇదే అంశంపై ఆదివారంనాడు తెలుగుగేట్ వే. కామ్ లో కెసిఆర్ వన్ మ్యాన్ షో పేరుతో ప్రత్యేక కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. సీన్ కట్ చేస్తే సచివాలయం ప్రారంభించిన మరుసటి రోజు అంటే సోమవారం నాడు పత్రికల్లో మే డే కి సంబధించి ఒక ప్రకటన వచ్చింది. విచిత్రంగా అందులో ముఖ్యమంత్రి కెసిఆర్ తో పాటు కార్మిక శాఖ మంత్రి మల్లా రెడ్డి ఫోటో కూడా పెట్టారు.

గతంలో పత్రికలకు ప్రకటనలు విడుదల చేసింది సమాచార, పౌర సంబంధాల శాఖే ..ఇప్పుడు మే డే యాడ్ కూడా అదే శాఖ విడుదల చేసింది. ఇది చూసిన వారికి ఎవరికైనా కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్ రెడ్డిల ఫోటోలు వేయకుండానే ఫుల్ పేజీల యాడ్స్ ఇచ్చిన తెలంగాణ సర్కారు ఇప్పుడు మాత్రం మే డే సందర్భంగా పత్రికలకు ఇచ్చిన పావు పేజీ ప్రకటనల్లో మాత్రం సీఎం కెసిఆర్ ఫోటో పెద్దగా వేసి మంత్రి మల్లారెడ్డి ఫోటో కూడా వేశారు. ఇది చూసిన వారు అంతా కెసిఆర్ సర్కారులో మంత్రి మల్లా రెడ్డి ఒక్కరే స్పెషలా అన్న చర్చ సాగుతోంది. మంత్రుల విషయంలో కూడా ఎందుకు ఈ వివక్ష చూపిస్తున్నారు అన్నది హాట్ టాపిక్ గా మారింది. ఇది కేవలం మల్లారెడ్డి స్పెషలా..లేక భవిష్యత్తులో వచ్చే అన్ని ప్రభుత్వ ప్రకటనల్లో తిరిగి గతంలో లాగా మంత్రుల ఫోటోలు పెడతారా అన్నది వేచిచూడాల్సిందే.

Next Story
Share it