Top
Telugu Gateway

టీఆర్ఎస్ సర్కారు పై సీబీఐ విచారణ కోరతాం

టీఆర్ఎస్  సర్కారు పై సీబీఐ విచారణ కోరతాం
X

బిజెపి తెలంగాణ ఇన్ ఛార్జి తరుణ్ చుగ్ వ్యాఖ్యలు

తెలంగాణ బిజెపి ఇన్ చార్జి తరుణ్ చుగ్ టీఆర్ఎస్ సర్కారుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రభుత్వంపై సీబీఐ విచారణ కోరతామని తెలిపారు. టీఆర్ఎస్ నేతల ఒత్తిళ్ళతో పోలీసులు నేరస్తులను కాపాడుతున్నారని విమర్శించారు. తెలంగాణలో రాక్షస పాలన సాగుతోందని ఆరోపించారు.

త్వరలోనే ఈ రాక్షస పాలనకు చరమగీతం పాడతామని ప్రకటించారు. తెలంగాణ ప్రజలకు బిజెపిపై నమ్మకం రోజురోజుకు పెరుగుతోందని తెలిపారు. వివిధ పార్టీల నేతలు బిజెపి వైపు చూస్తున్నారని, దోపిడీ దొంగలను బిజెపి ఎప్పుడూ వదిలిపెట్టలేదని వ్యాఖ్యానించారు.

Next Story
Share it