Telugu Gateway
Telangana

ప్రతి విషయంలో కేంద్రంతో గొడవ పెట్టుకోం

ప్రతి విషయంలో కేంద్రంతో గొడవ పెట్టుకోం
X

తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ అసెంబ్లీ సాక్షిగా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి విషయంలో కేంద్రంతో గొడవలు పెట్టుకోమన్నారు. రాజ్యాంగబద్ధంగా తాము పరిపాలన చేస్తున్నామని తెలిపారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై కేంద్రాన్ని వ్యతిరేకిస్తామని...ఘర్షణలు పెట్టుకుని ఆందోళనకర పరిస్థితులు తీసుకురామని వ్యాఖ్యానించారు. కేంద్రం వ్యవసాయ మార్కెట్లను ఎత్తేసినా తెలంగాణలో మాత్రం తాము మార్కెట్లను నడిపిస్తామని వ్యాఖ్యానించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడుతూ కెసీఆర్ పలు అంశాలపై స్పందించారు. 'కరోనా అక్కడక్కడా స్కూల్స్ లో- రెసిడెన్షియల్- హాస్టల్స్ లో వస్తోంది. స్కూళ్లఉ నడపాలా వద్దా అన్నది రెండు, మూడు రోజుల్లో అసెంబ్లీలోనే ప్రకటన చేస్తాం. దేశంలోనే అత్యధిక భూగర్భ జలాలు పెంచిన రాష్ట్రం తెలంగాణ అని నీతి ఆయోగ్ అని చెప్పింది. తెలంగాణ రైతులు- ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రాజెక్టుల రీడిజైన్ చేశాం. ప్రాజెక్టుల రీడిజైన్ చేసాము కాబట్టే- భూగర్భజలాలు పెరిగాయి. కేసీఆర్ కిట్ తమిళనాడు జయలలిత ను చూసి అమలు చేశాం. ఉమ్మడి రాష్ట్రంలో ఏ ప్రభుత్వం చేయని విదంగా గ్రామాలకు-పట్టణాలకు నిధులు ఇస్తున్నాము.

ప్రతి యాదవ కుటుంబానికి గొర్రెలు ఇస్తాం. ఆరేళ్లలో బస్తీ దవాఖాన ఢిల్లీ ప్రభుత్వం నుంచి చూసి హైదరాబాద్ లో అమలు చేశాం. ఉమ్మడి రాష్ట్రంలో చెట్లను నరుక్కుంటా పోతే..తెలంగాణలో చెట్లను నాటుకుంటూ వెళ్తున్నాము. టార్చ్ బేరర్ ఆఫ్ కంట్రీగా తెలంగాణ అవతరించింది. 50ఏళ్ల కాంగ్రెస్ హయాంలో బస్తీ దవాఖాన తెల్వదు. ధరణి తో 3లక్షల 40వేలకు పైగా రిజిస్ట్రేషన్ పూర్తి అయ్యాయి. ధరణి లో ఉన్న సమస్యలు రాబోయే రెండు మూడు నెలల్లో పరిష్కారం అవుతాయి. తెలంగాణ ల్యాండ్ మ్యాప్ కోసం రేపు బడ్జెట్ లో నిధులు. తెలంగాణ సరిహద్దులు స్పష్టంగా కనిపించే విదంగా- ఎవ్వరూ కబ్జా చేయకుండా మ్యాప్ ఉంటుంది. కరోనా వల్ల లక్ష కోట్లు తెలంగాణ పై భారం పడింది. రాబోయే రెండు మూడు రోజుల్లో పీఆర్సీ ప్రకటన చేస్తాం. లాయర్ల జంట హత్యలు జరగడం బాధాకరం. అడ్వకేట్ హత్య జరగడం - దురదృష్టకరం.. ఎవరూ ఒప్పుకోరు. అడ్వకేట్ హత్యలో 6 మందిని అరెస్ట్ పోలీసులు చేశారు. హత్య కేసులో మా మండల పార్టీ అధ్యక్షుడు ఉంటే వెంటనే తొలగించాం.

ఇప్పుడు వాళ్ళు జైల్లో ఉన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. భట్టి విక్రమార్క కాంగ్రెస్ పాలన భ్రమలో ఉన్నారు. రుణమాఫీ ప్రస్తావన ద్వారా కాంగ్రెస్ అట్టర్ ప్లాప్ అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ 2లక్షలు చేస్తామని చెప్పినా ప్రజలు నమ్మలేదు. మేము ఎన్నికల్లో చెప్పినట్లు రుణమాఫీ చేస్తాం. కాంగ్రెస్ మధ్యప్రదేశ్-రాజస్థాన్ లో చెప్పినా ప్రజలు నమ్మడం లేదు. రైతుల రుణాల పై వడ్డీని కూడా ప్రభుత్వమే భరిస్తుంది. 50శాతం కేబినెట్ తో కలిసి వెళ్లి- పోడు భూముల సమస్యలను పరిష్కారం చేస్తాం. దేశంలో దళిత గిరిజనులకు అన్యాయం జరిగింది. ఎస్టీ-ఎస్సి సబ్ ప్లాన్ తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే. పెట్రోల్- డీజిల్ పై కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పన్నులు వసూళ్లు చేసింది. పెట్రోల్- డీజిల్ రేట్ల పెంపు కేంద్రం చేతుల్లో ఉంటుంది. గవర్నర్ ప్రసంగాన్ని వ్యంగ్యంగా మాట్లాడే ప్రయత్నం భట్టి చేశారు. గవర్నర్ ప్రసంగం బుక్ పెద్దగా ఉందని అన్నారు...మేము చేసింది పెద్దగా ఉంది కాబట్టి బుక్ పెద్దగా ఉంది. ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం అప్పులు చేశాం- ఇంకాకుండా చేస్తాం.

2014లో 12లక్షల 23వేల ఎకరాల పంట సాగు ఉంటే...ప్రస్తుతం 58లక్షల పంట సాగులో ఉంది. తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది...రెండో స్థానంలో తమిళనాడు ఉంది. 2014 నుంచి ఇప్పటి వరకు రెండున్నర రేట్లు సాగు తెలంగాణలో పెరిగింది. నీటి పన్ను తెలంగాణ వచ్చాక రద్దు చేశాం. ఉచిత కరెంట్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రకటించారు- కానీ ఇవ్వలేదు. సెక్రటేరియట్ లో పాత ప్రాంతంలోనే దేవాలయాలు నిర్మిస్తాము. 2014 ముందు 29లక్షల పెన్షన్స్ ఉండేవి- ఇప్పుడు 39లక్షలు ఇస్తున్నాము. 2018 తరువాత 3లక్షల 59వేల పెన్షన్స్ కొత్తగా ఇచ్చాము. కాళేశ్వరం ప్రాజెక్టు లో అందరికి ఒకేలా నష్టపరిహారం ఇచ్చాము. గజ్వేల్ టౌన్ పక్కన 7వేల 5వందల ఇండ్లు ప్రాజెక్టు నిర్వాసితులకు కట్టి ఇస్తున్నాము. మల్లన్న సాగర్ ఆపేందుకు కోర్టులో కేసులు వేశారు. ' అని వ్యాఖ్యానించారు.

Next Story
Share it