Telugu Gateway
Telangana

వైజాగ్ స్టీల్ బిడ్డింగ్ కు సింగరేణి దూరం

వైజాగ్ స్టీల్ బిడ్డింగ్ కు సింగరేణి దూరం
X

అసలు అర్హత లేకపోయినా వైజాగ్ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ లో పాల్గొంటామని హంగామా చేశారు. అది కూడా ఫస్ట్ ఎంపిక చేసిన మీడియా సంస్థలకు మాత్రం లీక్ ద్వారా సమాచారం ఇచ్చారు. తర్వాత సింగరేణి సంస్థను ఈ బీడ్ లో పాల్గొనేందుకు గల అవకాశాలు పరిశీలించాలని సీఎం కెసిఆర్ ఆదేశించినట్లు మంత్రి కెటిఆర్ తో పాటు బిఆర్ఎస్ మంత్రులు ప్రకటించారు. అసలు కెసిఆర్ అలా ప్రకటించారో లేదో వెంటనే కేంద్రం ప్రవేటీకరణ విషయంలో వెనక్కు తగ్గింది అంటూ కూడా మధ్యలో ప్రచారం చేసుకున్నారు. సీన్ కట్ చేస్తే అసలు ప్రవేటీకరణ నుంచి వెనక్కి తగ్గే ఆలోచన ఏమీ లేదు అంటూ కేంద్రం స్పష్టం చేసింది. దీంతో ఒక్క సారిగా బిఆర్ ఎస్ కు షాక్ తగిలినట్లు అయింది. వైజాగ్ స్టీల్ ఈఓఐ లో పాల్గొనటానికి వీలుగా తమకు మరికొంత గడువు కావాలని సింగరేణి కోరింది. దీనికి వైజాగ్ స్టీల్ యాజమాన్యం కూడా ఓకే చేసింది. ఈ గడువు ముగిసిన కూడా సింగరేణి బిగ్ దాఖలు చేయలేదు. దీంతో బిఆర్ఎస్ అధినేత కెసిఆర్, మంత్రి కెటిఆర్ లు చేసింది కేవలం షో మాత్రమే అనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాజకీయంగా పబ్బం గడుపుకునేందుకు ఇలాంటి ప్రకటన చేసి..ఒక వారం రోజుల పాటు ఉచిత ప్రచారం పొందారు.

కానీ అసలు విషయం దగ్గరకు వచ్చే సారికి మాత్రం బిడ్ లో పాల్గొనకుండా దూరం జరిగారు. అసలు వైజాగ్ స్టీల్ బిడ్ లో పాల్గొంటామని కెసిఆర్ లీక్ వార్త వచ్చిన తర్వాత తెలంగాణలోని పలు వర్గాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఇక్కడి హామీలు తీర్చటం చేతకావటం లేదు కానీ...వైజాగ్ స్టీల్ కు బిడ్ వేస్తారా అంటూ పార్టీల తో పాటు పలు వర్గాల నుంచి దాడి పెరిగింది. కెసిఆర్ నిర్ణయం రాజకీయంగా కూడా బిఆర్ఎస్ కు నష్టం అనే అభిప్రాయం వ్యక్తం అయింది. ఇప్పుడు గడువు ముగిసిన తర్వాత సింగరేణి బిడ్ దాఖలు చేయలేదని తేలింది. దీంతో ఇది అంతా ఒక షో లా మారిపోయింది అనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాజా పరిణామాలతో కెసిఆర్ క్రెడిబిలిటీ మరింత డామేజ్ కావటం ఖాయం అనే చర్చ సాగుతోంది. తాజా పరిణామాలతో అటు రాజకీయంగా ...ఇటు విశ్వసనీయత పరంగా రెండు నష్టాలు జరిగే అవకాశం ఉంది అనే చర్చ సాగుతోంది. ఇదే అంశం ఆధారంగా రాబోయే రోజుల్లో ప్రత్యర్థి పార్టీలు బిఆర్ఎస్ ను టార్గెట్ చేయటం ఖాయం.



Next Story
Share it