Telugu Gateway
Telangana

హైకోర్టు కెక్కిన వెంక‌ట్రామిరెడ్డి వ్య‌వ‌హారం

హైకోర్టు కెక్కిన వెంక‌ట్రామిరెడ్డి వ్య‌వ‌హారం
X

తెలంగాణ రాజ‌కీయాల్లో మాజీ ఐఏఎస్ వెంక‌ట్రామిరెడ్డి వ్య‌వ‌హారం హాట్ టాపిక్ గా మారింది. సీఎం కెసీఆర్ అనూహ్యంగా ఆయ‌న‌కు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇవ్వ‌టంతో దుమారం రేగింది. ఆయ‌న‌పై చాలా ఫిర్యాదులు ఉన్నాయ‌ని..స్వ‌యంగా రాష్ట్ర‌ప‌తి రామ్ నాధ్ కోవింద్ కూడా వెంక‌ట్రామిరెడ్డి పై వ‌చ్చిన ఫిర్యాదుల‌పై విచార‌ణ జ‌రిపి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించార‌ని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఫిర్యాదులు పెండింగ్ లో ఉండ‌గా ఐఏఎస్ రాజీనామా ఆమోదించ‌టం ద్వారా కూడా సీఎస్ సోమేష్ కుమార్ కూడా నిబంధ‌న‌లు ఉల్లంఘించార‌ని ఆరోపించారు. అంతే కాదు..ఈ వ్య‌వ‌హారంపై మ‌రోసారి ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీతోపాటు సంబంధిత శాఖ‌కు పిర్యాదులు చేశారు. శాస‌న‌మండలి రిట‌ర్నింగ్ అధికారికి, రాష్ట్ర ముఖ్య ఎన్నిక‌ల అధికారికి సైతం కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది.

ఈ త‌రుణంలో ఇదే అంశంపై హైకోర్టులో కేసు కూడా దాఖ‌లైంది. ఆయన రాజీనామాను ఆగ‌మేఘాల మీద ఆమోదించడాన్ని సవాలుచేస్తూ సుబేందర్ సింగ్, శంకర్ లు గురువారం నాడు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఐఏఎస్ రాజీనామాను ఆమోదించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని పిటిషనర్లు తెలిపారు. ఐఏఎస్‌లు కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటారని పిటిషనర్లు పేర్కొన్నారు. వెంకట్రామిరెడ్డి నామినేషన్‌ను ఆమోదించకుండా ఆదేశాలివ్వాలని పిటిషనర్లు హైకోర్టును అభ్యర్థించారు. ఈసీ, శాసనమండలి కార్యదర్శి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రతివాదులుగా పిటిషనర్లు పేర్కొన్నారు. అయితే ఈ పిటీష‌న్ పై అత్యవసర విచారణ చేపట్టేందుకు హైకోర్టు నిరాకరించింది.

Next Story
Share it