Telugu Gateway
Telangana

తెలంగాణ‌లో ఎన్నిక‌లు రాష్ట్ర‌ప‌తి పాల‌న‌లోనే పెట్టాలి

తెలంగాణ‌లో ఎన్నిక‌లు రాష్ట్ర‌ప‌తి పాల‌న‌లోనే  పెట్టాలి
X

కాంగ్రెస్ ఎంపీ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. షెడ్యూల్ ప్ర‌కారం అయినా..ముంద‌స్తు ఎన్నిక‌లు అయినా రాష్ట్ర‌ప‌తి పాల‌న‌లోనే తెలంగాణ‌లో ఎన్నిక‌లు జ‌ర‌గాల‌న్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందస్తు ఎ‍న్నికలకు వెళ్లవచ్చని ఆయ‌న అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలు ఒకేసారి జరిగితే టీఆర్‌ఎస్‌ పని ఖతం అవుతుందని అన్నారు. ప్రముఖ ఎ‍న్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ కాంగ్రెస్‌లో చేరేందుకు కసరత్తు నడుస్తోందని తెలిపారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమ‌వారం నాడు మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ స‌ర్కారుపై తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు గుప్పించారు. రాష్ట్రంలో ఇంత వికృతమైన పరిపాలన ఊహించలేదన్నారు. కేసీఆర్ పాలన పోలీసులు, డబ్బుతో నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని ఒక కుటుంబం, కొంతమంది పోలీసు అధికారుల మాఫీయా నడిపిస్తోంద‌ని, టీఆర్ఎస్ నేతలు, పోలీసు అధికారుల వేధింపులు తాళలేక రామాయంపేటలో ఒక కుటుంబం బలైంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. వామన్‌రావు దంపతుల హత్య నడిరోడ్డుపై జరిగితే.. ఇంతవరకు దోషులను పట్టుకోలేదు.. కొత్తగూడెంలో ఎమ్మెల్యే కొడుకు చేసిన పనికి ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది.. విచారణ ఎక్కడికి వచ్చిందో ఎవరికి చెప్పరు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్‌ని బొంద పెట్టడం ఖాయం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పోలీసులకు మంచి పేరు ఉండేది.. కానీ ఇప్పుడు కేసీఆర్ ఆ వ్యవస్థను నాశనం చేశారు.కేసీఆర్‌కు అనుకూలంగా పనిచేయని అధికారులను పక్కన పెడుతున్నారని ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి మండిపడ్డారు.

'కేసీఆర్ మేనల్లుడు సంతోష్ చెప్తేనే.. పోలీసు శాఖలో బదిలీలు జరుగుతున్నాయి. జిల్లా ఎస్పీ అంటే.. ఐపీఎస్ ఆఫీసర్లు ఉండే వారు.. ఇప్పుడు 20 మంది నాన్ ఐపీఎస్ అధికారులు ఉన్నారు. టీఆర్ఎస్‌కు సహాకరిస్తున్న వారికే.. ఎస్పీ పోస్టింగ్‌లు ఇస్తున్నారు. హైదరాబాద్ పరిధిలో డీసీపీ‌లు సంవత్సరాలు పైబడిన ఒకే దగ్గర పనిచేస్తున్నారు. మరికొందరికి అసలు పోస్టింగ్‌లే ఇవ్వలేదు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లక్షల రూపాయలు తీసుకుని ఎస్ఐ, ఇతర పోస్టింగ్‌లకు రికమెండ్ చేస్తున్నారు. డబ్బులు తీసుకుని పోస్టింగ్‌లు ఇవ్వడం వల్లే.. రామాయంపేట లాంటి సంఘటనలు జరుగుతున్నాయి.. ఖమ్మంలో మున్సిపల్ కౌన్సిలర్ ముస్తఫాపై దొంగ కేసుపెడితే.. కోర్ట్ కొట్టేసింది. హుజూర్‌నగర్‌లో గోపీగౌడ్‌పై కేసు పెడితే.. ఇది తప్పుడు కేసు అని మాట్లాడితే పోలీసులు వినలేదు.. గోపీగౌడ్ టీఆర్ఎస్‌లో చేరిన తర్వాత వెంటనే కేసు తొలగించారు. ఎమ్మెల్యేలకు 5,6 పైలెట్ ఎస్కార్ట్‌లు ఎందుకు.. గ్రామాల్లో టీఆర్ఎస్ నేతలు అరాచకం చేస్తున్నారు అని'' ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. చివ‌ర‌కు కోర్టులు చెప్పినా కూడా పోస్టింగ్ లు ఇవ్వ‌టంలేద‌ని మండిప‌డ్డారు.

Next Story
Share it