Telugu Gateway
Telangana

బిఆర్ఎస్ కు తుమ్మల గుడ్ బై

బిఆర్ఎస్ కు తుమ్మల గుడ్ బై
X

ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అధికార బిఆర్ఎస్ కు రాజీనామా చేశారు. అయన కాంగ్రెస్ లో చేరతారని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పలు మార్లు కాంగ్రెస్ నేతలు తుమ్మల నాగేశ్వర్ రావు ను కలిసి మాట్లాడారు కూడా. ఈ తరుణంలో ఆయన శనివారం ఉదయం బిఆర్ఎస్ కు రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధినేత కెసిఆర్ కు లేఖ పంపారు. అందులో అయన కెసిఆర్ ను బిఆర్ఎస్ అధ్యక్షుడు అని సంబోధించారు...మరో వైపు లేఖలో మాత్రం తెలంగాణ రాష్ట్ర సమితి లో తనకు సహకరించినందుకు ధన్యవాదాలు.

పార్టీ కి నా రాజీనామా సమర్పిస్తున్నాను అంటూ పేర్కొన్నారు. ఈ లేఖలో తుమ్మల నాగేశ్వర్ రావు తెలంగాణ రాష్ట్ర సమితి లో తనకు సహకరించినందుకు అని రాయటం అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అంశం. రాజీనామా లేఖలో కూడా తుమ్మల తనదైన స్టైల్ చూపించారు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు ఇదే కెసిఆర్, తుమ్మల నాగేశ్వర్ రావు అందరు తెలుగు దేశం లో కలిసి పనిచేసిన విషయం తెలిసిందే. ఖమ్మం జిల్లా కు చెందిన కీలక నేతలు వరసగా పార్టీ ని వీడటంతో వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభావం బిఆర్ఎస్ పై ఎలా ఉండబోతోఉంది అనే చర్చ సాగుతోంది.

Next Story
Share it