టీఎస్ పీఎస్ సీ ఛైర్మన్ గా ఐఏఎస్ జనార్ధన్ రెడ్డి
తెలంగాణ సర్కారు ఎట్టకేలకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్, సభ్యులను నియమించింది. కొద్ది రోజుల క్రితం హైకోర్టు కూడా ఛైర్మన్, సభ్యులను నియమిస్తారా? లేక టీఎస్ పీఎస్ సీని మూసేస్తారా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ నియామకాలకు నిర్దేశిత గడువు కూడా పెట్టి విచారణను వాయిదా వేసింది. దీంతో బుధవారం నాడు సర్కారు ఈ నియామకాలను పూర్తి చేసింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్., సభ్యులను రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నియమించారు. సిఎం కెసిఆర్ ప్రతిపాదనల మేరకు గవర్నర్ ఆమోదించారు.చైర్మన్ గా .. డా. బి. జనార్ధన్ రెడ్డి (ఐఎఎస్) (వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శిగా ప్రస్తుతం పనిచేస్తున్నారు ).
సభ్యులు గా.. రమావత్ ధన్ సింగ్ (బిటెక్ సివిల్, రిటైర్డ్ ఈఎన్ సీ)., ప్రొ. బి. లింగారెడ్డి (ఎమ్మెస్సీ పిహెచ్ డీ .,ప్రొ. హెడ్ డిపార్డ్మెంట్ ఆఫ్ ఫిజిక్స్ సిబిఐటి)., కోట్ల అరుణ కుమారి (బిఎస్సీ బీఈడీ., ఎంఎ, ఎల్ ఎల్ బీ., స్పెషల్ గ్రేడ్ డిప్యూటి కలెక్టర్ ) సుమిత్రా ఆనంద్ తనోబా (ఎంఎ తెలుగు., తెలుగు పండిట్ )., కారం రవీందర్ రెడ్డి (బికాం, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి) ఆరవెల్లి చంద్రశేఖర్ రావు (బి ఎ ఎమ్ ఎస్(ఉస్మానియా)., ప్రాక్టీసింగ్ ఆయుర్వేదిక్ డాక్టర్) ఆర్. సత్యనారాయణ (బిఎ., జర్నలిస్ట్)...లను సిఎం కెసిఆర్ నియమించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను సిఎం కెసిఆర్ ఆదేశించారు.