పారదర్శకంగా భవన నిర్మాణ అనుమతులు
తెలంగాణలో ఇక భవన నిర్మాణ అనుమతుల అత్యంత పారదర్శకంగా సాగనున్నాయని..దీని కోసం ఎవరూ రూపాయి లంచం ఇవ్వాల్సిన అవసరం ఉండదని తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కెటీఆర్ తెలిపారు. ఇంటి అనుమతుల కోసం ఉద్దేశించిన టీఎస్ఎస్ బీపాస్ పోర్టల్ ను కెటీఆర్ సోమవారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ప్రజలకు మేలు చేసేలా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినట్లు తెలిపారు. 'పట్టణీకరణ వేగంగా జరుగుతుంది. 43% జనాభా పట్టణాల్లో ఉన్నారు. ఓఆర్ఆర్ లోపలనే 43% జనాభా ఉంది. అధికార వికేంద్రీకరణ వల్ల ప్రజలకు సేవలు తొందరగా అందుతాయి.ప్రజలకు మేలుచేసే చట్టాలు చేయడం వల్ల వేలకోట్ల ఖర్చు తగ్గుతుంది. పాస్ పోర్ట్ కోసం ఏవిధంగా అప్లై చేస్తామో అలాగే ధరణి కూడా అంతే పారదర్శకంగా సేవలు అందుతాయి. మన మిషన్ భగీరథను 12 రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. టిఎస్ బిపాస్ ఒక మంచి సంస్కరణ. 2015 లొనే డిపిఎంఎస్ ను తీసుకోచ్చాము.75 గజాల స్థలానికి రిజిస్ట్రేషన్ ఉంటే సరిపోతుంది. 75 నుండి 600 గజాల వరకు స్వీయదృవీకరణ పత్రం ఇస్తే అప్పటికప్పుడే పర్మిషన్ వస్తుంది.
రెండు నెలల్లో కొత్త జిహెచ్ఎంసి కొత్త చట్టం తీసుకురాబోతున్నాము. పట్టణీకరణ ఏ విధంగా వేగంగా జరుగుతుందో అదే స్థాయిలో ప్రణాళిక లేకుండా పోతుంది. స్వీయ దృవీకరణలో నిబంధనలు అతిక్రమిస్తే అంతేస్థాయిలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. టిడిఆర్ బ్యాంకు తీసుకొచ్చాము.యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ తీసుకోచ్చాము.ఇవన్నీ పౌరుడికి మేలు చేయడం కోసమే.టిఎస్ బిపాస్ ను రేరాకు అనుసంధానం చేయాలని అధికారులకు చెబుతున్నాను.హైదరాబాద్ లో నిర్మాణరంగం చాలా వేగంగా దూసుకువెళ్తుంది.నిర్మాణరంగ సంస్థలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రభుత్వం మీకు అన్ని సదుపాయాలు కల్పిస్తుంది కానీ మీరు మీ నమ్మకాన్ని పోగొట్టుకోవద్దు. అందరికి అందుబాటులో ఉండే ధరలలో ఇళ్ళను అందించండి'. అని కోరారు.