జగన్ తో అలా...ఆదిత్యాఠాక్రేతో ఇలా!
నేరుగా చెప్పకపోయినా తెలంగాణ ఐటి , పరిశ్రమల శాఖ మంత్రి కెటీఆర్ చెప్పాల్సింది అంతా ఫోటోల ద్వారానే చెప్పేశారు. ప్రస్తుతం దావోస్ లో ఉన్న ఆయన ఏపీ సీఎం జగన్ తో ఆప్యాయంగా ఫోటోలు దిగారు. ఆ ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశారు. ఇవి ఇప్పుడు వైరల్ గా మారాయి. జగన్ తో ఫోటోలకు నా సోదరుడితో మంచి సమావేశం జరిగింది అంటూ రాసుకొచ్చారు. ఆ తర్వాత కెటీఆర్ మహారాష్ట్రకు చెందిన పర్యాటక, పర్యావరణ శాఖ మంత్రి ఆదిత్యఠాక్రేతో సమావేశం అయ్యారు.
యువ, డైనమిక్ నాయకుడు ఆదిత్యఠాక్రేతో సమావేశం కావటం ఎంతో ఆనందంగా ఉందని, తెలంగాణ, మహారాష్ట్రలు కలసి పనిచేయటానికి అవకాశం ఉన్న రంగాలు ఏమిటనే అంశంపై లోతుగా చర్చించామని పేర్కొన్నారు. బలమైన రాష్ట్రాలు..బలమైన కేంద్రం అంటూ పేర్కొన్నారు. అంటే ఏపీతో కలసి తాము చేయాల్సింది ఏమీలేదని కెటీఆర్ ఈ ఫోటోల ద్వారానే చెప్పకనే చెప్పారనే వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. ఆదిత్యఠాక్రేకు జ్ణాపిక కూడా అందించిన కెటీఆర్..జగన్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఫోటోలతోనే సరిపెట్టారు.
అ