Telugu Gateway
Telangana

డీజె టిల్లు డైలాగులు వాడి... కెటిఆర్ బుక్ అయ్యారా?!

డీజె టిల్లు డైలాగులు వాడి... కెటిఆర్  బుక్ అయ్యారా?!
X

డీజె టిల్లు డైలాగులు వాడి... కెటిఆర్ బుక్ అయ్యారా?!

బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి కెటిఆర్ గురువారం నాడు గంటల వ్యవధిలోనే మాటలు మార్చారు. అందులో నాది ఏమి ఉంది...బీజేపీ మంత్రి ఆలా చెప్పారు కాబట్టి తాను అలా చెప్పానని ప్రకటించుకోవచ్చు. బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ దెబ్బకు కేంద్రం దిగివచ్చింది...వైజాగ్ స్టీల్ కోసం సింగరేణి బిడ్ వేయటానికి రెడీ కావటంతో కాదు..అసలు వెళ్లి ఒక సారి చూసి రంధి అని చెప్పటంతో కేంద్రం వైజాగ్ స్టీల్ ప్రవేటీకరణ ఆపేసింది ..కెసిఆర్ ఏదైనా తలచుకుంటే ఇలాగే ఉంటది అని...డీజీ టిల్లు సినిమాలోని డైలాగ్ తరహాలో దెబ్బ అంటే గట్లుంటది. కెసిఆర్ ఏ పని మొదలు పెట్టినా అట్లనే ఉంటది అని క్రెడిట్ క్లెయిమ్ చేసుకోవటంలో యమా పోటీపడ్డారు. అయన ఒక్కరే కాదు...మరో మంత్రి హరీష్ రావు కూడా అదే పనిచేశారు. బిఆర్ఎస్ నేతలు అందరూ రంగంలోకి దిగి కెసిఆర్, కెటిఆర్ పోరాటం చేయటం వల్లనే స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ ఆగిపోయింది అన్నంత కలరింగ్ ఇచ్చారు.

కానీ గురువారం సాయంత్రానికి సీన్ రివర్స్ అయింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలతో మాట్లాడిన మంత్రి ఫ‌గ్గ‌న్ సింగ్ ఇప్పటికే దీనిపై కేంద్ర కాబినెట్ నిర్ణయం తీసుకుంది అని..తాను నోటి మాటగా ఇలాంటి వాటిపై హామీ ఇవ్వలేను అని తేల్చేశారు. దీంతో కథ అంతా అడ్డం తిరిగినట్లు అయింది. సీఎం కెసిఆర్ తో పాటు తాము గట్టిగా చేసిన పోరాటం వల్లే ఇది ఆగిపోయింది అంటూ తొలుత ప్రకటించుకున్నారు. వ్యవహారం సాయంత్రానికి మారిపోవటం తో మళ్ళీ కెటిఆర్ కూడా మాట మార్చారు. అదానీ..బైలదిల్లా గనుల కేటాయింపు అంశంపై దృష్టి మరల్చటానికే కేంద్రం కేంద్రం ఈ ఎత్తుగడ వేసింది అంటూ మరో ప్రకటన చేశారు.. అయితే మంత్రి కెటిఆర్ చెప్పే .బైలదిల్లా గనులు కేంద్రం ప్రభుత్వ సంస్థ ఎన్ ఎండీసి, ఛత్తీస్ గఢ్ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లు కలిసి ఒక జాయింట్ వెంచర్ కంపెనీ ఎన్ సి ఎల్ కంపెనీ గా ఏర్పడి దీని కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అయితే ఈ మైన్ లో అదానీ కి చెందిన కంపెనీ ఒకటి ఐరన్ ఒర్ తవ్వకం, నిర్వహణ బాధ్యతలు మాత్రమే చూస్తుంది కానీ..మైనింగ్ లీజ్ విషయం అసలు అదానీ కి ఎలాంటి సంబంధం లేదు అని అధికారవర్గాలు చెపుతున్నాయి. కానీ మంత్రి కెటిఆర్ మాత్రం బైలదిల్లా మైనింగ్ లీజ్ అదానీ కి ఇచ్చినట్లు చెపుతున్నారు అని..ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదు అన్నది ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు చెపుతున్న విషయం. కెటిఆర్ అదానీ కి మైనింగ్ లీజ్ ఇచ్చారు అంటూ చేసిన విమర్శలపై బీజేపీ నేతలు కూడా ఎక్కడా స్పందించిన దాఖలాలు లేవు.

Next Story
Share it