Telugu Gateway
Telangana

ఏసుక్రీస్తు వల్లే కరోనా పోయింది

ఏసుక్రీస్తు వల్లే కరోనా పోయింది
X

తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస రావు మరో వివాదంలో చిక్కుకున్నారు. కరోనా పోయింది ఏసు క్రీస్తు వల్లే అంటూ సంచలన వ్యాఖలు చేశారు. అంతే కానీ మనం అందించిన సేవల వల్ల కాదన్నారు. రెండున్నర ఏళ్ళు ప్రపంచాన్ని కరోనా వేధించింది అని ...మానవ జాతి మనుగడకు ఇది పెద్ద సవాలుగా మారింది అని చెప్పారు. ఏసు క్రీస్తు కృప, దయ వల్లే ఇది తగ్గింది అన్నారు. మరి హెల్త్ డైరెక్టర్ గా అందరూ వాక్సిన్లు తీసుకోవాలి...వాక్సిన్ తోనే కరోనా కు అడ్డుకట్ట వేయగలం అని అంతకు ముందు చెప్పింది అబద్దమా..ఇప్పుడు చెప్పింది అబద్దమా. కొత్తగూడెంలో జరిగిన ఒక కార్యక్రంలో మాట్లాతుతూ అయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయన కరోనా విషయంతోనే ఆగలేదు. మన దేశానికీ కానీ..రాష్ట్రానికి కానీ ఆధునిక సంస్కృతికి వారధులు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం క్రైస్తవులే. ఈ విషయాన్నీ మనం అందరం గుర్తు పెట్టుకోవాలి. లేకపోతే ప్రపంచంలో భారత దేశం మనుగడ సాగించలేకపోయేది. దేశం ఇంత అభివృద్ధి చెందేది కాదు. ఈ రూపంలో దేశానికీ ఆధునిక వైద్యము, విద్యను అందించారు.

ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ఈ అంశంపై వీహెచ్ పీ తీవ్రంగా స్పందించింది. తెలంగాణ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసింది. ఏసుక్రీస్తు వల్లనే భారతదేశం అభివృద్ధి చెందుతుందని ఆయన మాట్లాడటం ముమ్మాటికి తగదని విశ్వహిందూ పరిషత్ హెచ్చరిస్తోంది. ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్న వ్యక్తి మతాలను ప్రేరేపించే విధంగా కిందిస్థాయి ఉద్యోగులను ప్రభావితం చేసే విధంగా హిందువులను కించపరిచే స్థాయిలో మాట్లాడటం తగదని తీవ్రంగా హెచ్చరించింది. హిందుత్వాన్ని, వైద్య విధానాన్ని, సైన్స్ ను, శాస్త్రవేత్తలను కించపరిచే స్థాయిలో మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండించారు. లక్షల మంది వైద్యులు.. కోట్ల మంది వైద్య సిబ్బంది.. శాస్త్రవేత్తలు అహోరాత్రులు శ్రమిస్తే గాని కరోనా అదుపులోకి రాలేదన్న విషయాన్ని శ్రీనివాస్ రావు విస్మరించడం ఆయన బుద్ధిలేనితనానికి నిదర్శనం అన్నారు. తమ డిపార్ట్మెంట్లోని ఉద్యోగులందరినీ హిందూ క్రైస్తవులుగా విభజించి, క్రైస్తవులకు మేలు కలిగే విధంగా ఆయన మాట్లాడారని ఆరోపించారు. ఇది ముమ్మాటికి క్షమించరాని నేరమని తప్పుపట్టారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆయనను విధుల నుంచి సస్పెండ్ చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విశ్వహిందూ పరిషత్ నేతలు డిమాండ్ చేశారు.

Next Story
Share it