Telugu Gateway
Telangana

స్కూళ్లు ట్యూష‌న్ ఫీజు మాత్ర‌మే వ‌సూలు చేయాలి

స్కూళ్లు ట్యూష‌న్ ఫీజు మాత్ర‌మే వ‌సూలు చేయాలి
X

జులై ఒక‌టి నుంచి ఆన్ లైన్ క్లాస్ ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన తెలంగాణ స‌ర్కారు ఫీజుల‌కు సంబంధించి కూడా క్లారిటీ ఇచ్చింది. ముఖ్యంగా ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల దోపిడీపై సీరియ‌స్ హెచ్చ‌రిక‌లు చేసింది. స్కూల్‌ ఫీజులు పెంచొద్దని ఆదేశాలు జారీ చేసింది. జీవో 46ను కొనసాగిస్తూ కొత్త‌గా జీవో 75ను ప్రభుత్వం విడుదల చేసింది. కేవలం ట్యూషన్‌ ఫీజు మాత్రమే తీసుకోవాలని ఆదేశించింది.

ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘిస్తే అనుమతి రద్దు చేస్తామని హెచ్చరించింది. ఒకవైపు ప్రభుత్వం హెచ్చరిస్తున్నా, ప్రైవేట్‌ స్కూళ్లు తమ పంథా మార్చుకోకుండా అధిక ఫీజులు వసూలు చేయడంపై పదేపదే ఫిర్యాదులు రావడంతో సర్కారు స్పందించింది. దీనిలో భాగంగా స్కూల్‌ ఫీజులు పెంచొద్దంటూ వార్నింగ్‌ ఇచ్చింది. ఈ అంశంపై మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి కూడా మాట్లాడారు.

Next Story
Share it