Telugu Gateway
Telangana

తెలంగాణ‌లో పోలీసు ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్

తెలంగాణ‌లో పోలీసు ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్
X

తెలంగాణ‌లో నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నా ఉద్యోగ నోటిఫికేష‌న్లు ఒక్కొక్క‌టిగా విడుద‌ల‌కు రంగం సిద్ధం అయింది. సోమ‌వారం నాడు ఎక్కువ పోస్టులు ఉన్న పోలీస్‌ నియామకాలకు నోటిఫికేష‌న్ విడుదలైంది. కానిస్టేబుళ్లు, ఎస్‌ఐ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 16,027 పోస్టులకు నోటిఫికేషన్ వెలువ‌డింది. ఎస్‌ఐ పోస్టులు 414 , సివిల్‌ కానిస్టేబుళ్లు 4,965, ఏఆర్‌ కానిస్టేబుళ్లు 4,424, టీఎస్‌ఎస్‌పీ బెటాలియన్‌ కానిస్టేబుళ్లు 5,010, స్పెషల్‌ పోలీస్‌ ఫోర్స్‌ 390, ఫైర్‌ 610, డ్రైవర్స్‌ 100 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదలైంది. మే 2 నుంచి 20 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులకు అనుమతి ఇచ్చారు. www.tslprb.inలో దరఖాస్తు చేసుకోవచ్చు.ఈ పోస్టులకు మే 2 నుంచి 20 వరకు ఆన్‌లైన్‌లో అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది.

Next Story
Share it