విమానంలో గవర్నర్ తమిళ్ సై వైద్యం
విమాన ప్రయాణంలో ఆకస్మికంగా అనారోగ్యానికి గురైన ఓ ప్రయాణికుడిని తెలంగాణ గవర్నర్ తమిళ్ సై ప్రాథమిక చికిత్స అందించారు. ఆమె డాక్టర్ అన్న విషయం తెలిసిందే. ఢిల్లీ-హైదరాబాద్ ఇండిగో విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అదే సమయంలో విమాన సిబ్బందికి ఆమె పలు సూచనలు చేశారు. విమానం గాలిలో ఉండగానే అప్పుడప్పుడు కొంత మంది ప్రయాణికులు అనారోగ్యానికి గురైన సందర్భాలు ఎన్నో.
ఆ సమయంలో ప్రయాణికుల్లో ఎవరైనా డాక్టర్ ఉంటే వారికి చికిత్స అందిస్తూ ఉంటారు. విమాన ప్రయాణికుల్లో ఎవరైనా వైద్యులు ఉంటే ముందే చార్ట్ లో ఆ వివరాలు పొందుపరిస్తే బాగుంటుందని..ఆకస్మికంగా ఎవరికైనా వైద్య సేవలు అవసరం అయితే వెంటనే వారిని సేవలు అందించాల్సిందిగా కోరటానికి ఛాన్స్ ఉంటుందని ఆమె తెలిపారు. గవర్నర్ తమిళ్ సై స్పందించిన తీరు చూసి ప్రయాణికులు ఆమెను ప్రశంసించారు.