Telugu Gateway
Telangana

జర్నలిస్టులనూ మోసం చేస్తున్న కెసిఆర్

జర్నలిస్టులనూ మోసం చేస్తున్న కెసిఆర్
X

టీవీల్లో వార్తలు చూసే అలవాటు ఉన్న వారికి బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ హైదరాబాద్ లో జర్నలిస్టులకు ఇప్పటికే పది, పదిహేను సార్లు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఉంటారు అనుకుంటారు. ఎందుకంటే అయన ఈ విషయాన్నీ అన్ని సార్లు మీడియా సాక్షిగా చెప్పారు కనుక. సుప్రీమ్ కోర్ట్ లో కేసు క్లియర్ అయితే చాలు వెంటనే మీ సమస్య పరిష్కరిస్తానని అయన పలు మార్లు హామీ ఇచ్చారు. కానీ తీరు చూస్తే మాత్రం సీఎం కెసిఆర్ మాటలు కోటలు దాటుతాయి ...కానీ పని మాత్రం అడుగు ముందుకు పడదు. ఎంత దారుణం అంటే పద్నాలుగు సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత గత ఏడాది ఆగష్టు లో సుప్రీమ్ కోర్ట్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వటంలో ఉన్న అడ్డంకులు అన్నింటిని తొలగించింది. కానీ ఇప్పటి వరకు ఈ అంశంపై మాట్లాడటానికి కూడా సీఎం కెసిఆర్ సమయం ఇవ్వలేదంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. కెసిఆర్ అపాయింట్మెంట్ కోసం రకరకాల ప్రయత్నాలు చేసి..చివరకు సొసైటీ పేరుతో అధికారికంగా లేఖ ఇచ్చిన కూడా ...ఇందులో తెలుగు, ఇంగ్లీష్ లో ఉండే అన్ని ప్రధాన పత్రికల ప్రతినిధులు , అన్ని కీలక టీవీల ప్రతినిధులు ఉన్నా కూడా సీఎం కెసిఆర్ మాత్రం డోంట్ కేర్ అంటున్నారు. ఇప్పటికే అలాట్ అయి డబ్బులు కట్టినవారికి, ఇంకా అర్హులుగా ఉన్న వేలాది మంది జర్నలిస్టుల విషయం ఏమీ తేల్చకుండా మోసం చేస్తున్నారు. కెసిఆర్ చెప్పిన మాటను ఆయనే పట్టించుకోవటం లేదు. నెలకు లక్షల్లో జీతాలు తీసుకునే ఎమ్మెల్యేలు, ఐఏఎస్ ల కేసు తేలకుండా కేవలం సుప్రీమ్ కోర్ట్ లో ఒక్క జర్నలిస్ట్ లకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ రావటం పై కూడా కెసిఆర్ నిర్ణయం తీసుకోకపోవటానికి ఒక కారణంగా చెపుతున్నారు.

తీర్పు సమయంలోనే అప్పటి సిజెఐ ఎన్ వీ రమణ ఎంతో స్పష్టంగా చెప్పారు. అతి తక్కువ జీతాలతో పనిచేసే జర్నలిస్టులకు...ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఏఎస్ లతో కలిపి చూడటం లేదని..అందుకే ఈ కేసు ను సెపరేట్ చేసి మరి తీర్పు ఇచ్చారు. ఇదిలా ఉంటే ఇప్పటికే భూములు కేటాయించిన సొసైటీ లో ఆంధ్రా ప్రాంతానికి చెందిన వాళ్ళు ఎక్కువగా ఉన్నందునే కెసిఆర్ ఈ విషయంలో కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వటం లేదు అని ఆ టీం చెపుతోంది. సొసైటీ లో ఉన్న మొత్తం 1100 మందిలో ఆంధ్రా ప్రాంతం వాళ్ళు మహా ఉంటే 250 నుంచి 300 మంది ఉంటారు. అయినా కూడా ఇది ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చింది...జాబితాలో ఉన్నవాళ్లు అంటే గత రెండు దశాబ్దాలకు పైగా హైదరాబాద్ లో జర్నలిస్టులుగా పని చేసిన వారు..చేస్తున్న వారే. కెసిఆర్ మాత్రం ఆంధ్రా లో పోటీ చేయవచ్చు,,.మహారాష్ట్ర, కర్ణాటక ఇలా దేశమంతా పోటీ చేయవచ్చు, జర్నలిస్ట్ గా పని చేసి...అర్హత ప్రకారం ఇళ్ల స్థలం వస్తే మాత్రం ఆంధ్ర వాళ్ళు ఉన్నారనే పేరు చెప్పి తెలంగాణ జర్నలిస్టుల జీవితాలతో కూడా ఆడుకుంటున్నారు. . ఈ పరిణామాలు జర్నలిస్టులలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. దేశం లో అందరి సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టులు ఎలాగూ మేనేజ్ మెంట్ కు వ్యతిరేకంగా ఏమీ చేయలేరు..కనీసం ప్రభుత్వం చేసే మోసంపై కూడా సింగల్ కాలమ్ వార్త రాసుకోలేని దౌర్భాగ్య స్థితి. అందు కే హామీ ఇచ్చి కూడా కెసిఆర్ ఇలా మోసం చేయగలుగుతున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. గత ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి వాళ్ళను మోసం చేసినట్లు..ఇప్పుడు జర్నలిస్టులను కూడా మోసం చేస్తున్నారు.

Next Story
Share it