Telugu Gateway
Telangana

కెసీఆర్ వ‌ల్లే రేవంత్ కు ప‌ద‌వి వ‌చ్చింది

కెసీఆర్ వ‌ల్లే రేవంత్ కు ప‌ద‌వి వ‌చ్చింది
X

'దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా' స‌భ‌లో తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు ఎంపీ రేవంత్‌రెడ్డి చేసిన విమ‌ర్శ‌ల‌పై టీఆర్‌ఎస్‌ నేతలు గురువారం కౌంటర్‌ ఎటాక్‌ చేశారు. రేవంత్‌రెడ్డి జైలుకు వెళ్లక తప్పదని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పేర్కొన్నారు. ఓటుకు నోటు కేసు ఇంకా లైవ్ లోనే ఉంద‌న్నారు. దళితుల కోసం కేసీఆర్‌ రూ.55వేల కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. రావిర్యాల స‌భ‌లో ముఖ్య‌మంత్రి కెసీఆర్, మంత్రి కెటీఆర్ ల‌పై రేవంత్ తీవ్ర విమ‌ర్శ‌లు చేసిన విష‌యం తెలిసిందే. మ‌రో ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డి మాట్లాడుతూ రేవంత్ పెద్ద తెలంగాణ ద్రోహి అని ఆరోపించారు.

తెలంగాణ ప్రభుత్వము లక్షా 26వేల ఉద్యోగాలు భర్తీ చేసిందన్న విషయం తెలియ‌దా అని ప్ర‌శ్నించారు.' రేవంత్ నీకు టీపీసీసీ ఉద్యోగం రావడానికి సీఎం కేసీఆర్ కారణం. తెలంగాణ ఇచ్చామని చెప్పుకున్న కాంగ్రెస్‌ను రాష్ట్ర ప్రజలు 200 కిలోమీటర్ల లోతులో పాతరపెట్టారు.. ఇక ఎక్కడి నుంచి సోనియా రాజ్యం వస్తుంది..? 2009లో కొడంగల్‎లో నువ్వెట్లా గెలిచావ్ రేవంత్.. పొత్తు వల్ల కాదా..?. కేసీఆర్, కేటీఆర్ ఆదేశిస్తే.. రేవంత్‎ను 300కిలో మీటర్ల లోతుకు తొక్కుతాం.' అని ధ్వ‌జ‌మెత్తారు.

Next Story
Share it