Telugu Gateway
Telangana

టీఆర్ఎస్ తండ్రీ..కొడుకుల పార్టీ..!..2023 కంటే ముందే ఎన్నికలు

టీఆర్ఎస్ తండ్రీ..కొడుకుల పార్టీ..!..2023 కంటే ముందే ఎన్నికలు
X

బిజెపి జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కె. లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ తండ్రీ, కొడుకుల పార్టీ అయితే..ఎంఐఎం అన్నదమ్ముల పార్టీ అని ఎద్దేవా చేశారు. 2023 కంటే ముందే ఎన్నికలు రావొచ్చని తెలిపారు. టీఆర్ఎస్ పాలనపై ప్రజలు విసిగిపోయారన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ కు చెంపపెట్టు లాంటి సమాధానం చెప్పారన్నారు.

టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగినట్లు తెలిపారు లక్ష్మణ్. ఎంఐఎం 150 సీట్లలోఎందుకు పోటీచేయలేదని ప్రశ్నించారు. జానారెడ్డి బిజెపిలోకి చేరుతున్నారనే అంశంపై తనకు సమాచారం లేదన్నారు. తెలంగాణలో బిజెపి వరస పెట్టి దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మంచి ఫలితాలు దక్కించుకుని దూసుకెళుతోంది. దీంతో పార్టీ నేతలు అందరూ 2023లో జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి పెట్టి ముందుకు సాగుతున్నారు.

Next Story
Share it