Top
Telugu Gateway

బండి సంజయ్ ఆధారాలు చూపెట్టాలి

బండి సంజయ్ ఆధారాలు చూపెట్టాలి
X

బిజెపి ఎంపీ, తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శలపై టీఆర్ఎస్ కౌంటర్ ఇచ్చింది. మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ లు మీడియాతో మాట్లాడారు. ఎంపీగా ఉన్న బండి సంజయ్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం సరికాదన్నరు తలసాని. మంత్రులు..ఎమ్మెల్యేలపై చేసిన ఆరోపణలకు ఆధారాలు ఉంటే చూపాలన్నారు. సీఎం కెసీఆర్ కరోనా అంశంపై నిత్యం సమీక్షలు చేస్తున్నారని...ప్రతి రోజూ సీఎస్ తోపాటు ఇతర అధికారులతో మాట్లాడుతూ తగు సూచనలు చేస్తున్నారని చెప్పారు. శనివారం నాడు కూడా రోజుకు మూడుసార్లు కరోనాపై సమీక్ష జరిపి..కరోనా బాధితులకు ఎలాంటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారన్నారు.

కరోనా నియంత్రణకు తాము ఏమి చేస్తున్నామో సంజయ్ కేంద్రాన్ని అడిగితే బాగుంటుందని సూచించారు. గాలి మాటలు మాట్లాడటం చాలా సులువు- ప్రభుత్వంలో ఉంటే బాధ్యత ఏంటో తెలుస్తుండే అని వ్యాఖ్యానించారు. ' బండి సంజయ్ లెక్క మేము మాట్లాడగలం. రాజకీయంలో ఉన్నప్పుడు బాధ్యతతో మాట్లాడాలి. సంజయ్ ది నోరా తాటి మట్టనా. సీఎం కు కరోనా వచ్చినా రోజూ కోవిడ్ పై మానిటరింగ్ చేస్తున్నారు. ప్రజలు ఎవరికి అనుకూలంగా ఉన్నారో రేపు నాగార్జున సాగర్ ఫలితాలు తెలుస్తుంది. బండి సంజయ్ కు దమ్ము ఉంటే కేంద్రాన్ని ప్రశ్నించాలి. ఎమ్మెల్యేలు మంత్రుల పై బండి సంజయ్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాము.' అని బాల్క సుమన్ వ్యాఖ్యానించారు.

Next Story
Share it