Telugu Gateway
Telangana

ఈటలకు నోటీసులు..గడువు కోరిన ఎమ్మెల్యే

ఈటలకు నోటీసులు..గడువు కోరిన ఎమ్మెల్యే
X

తెలంగాణ లో పేపర్ లీక్ ల వ్యవహారం రాజకీయ పార్టీ ల చుట్టూ తిరుగుతోంది. ఇప్పటికే పదవ తరగతి ప్రశ్నపత్రాల లీక్ కేసు లో బీజేపీ తెలంగాణ ప్రెసిడెంట్ బండి సంజయ్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఇదే కేసు లో తాజాగా బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు కూడా పోలీస్ లు నోటీసు లు ఇచ్చారు. శామీర్ పెట్ లోని అయన నివాసానికి వెళ్లి పోలీసులు నోటీసులు అందించారు. ఈటల తో పాటు అయన పీఏ లు రాజు, నరేంద్ర లకు కూడా నోటీసు లు ఇచ్చారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని ఎమ్మెల్యే ఈటలకు ఇచ్చిన నోటీసుల్లో పోలీసులు కోరారు. వరంగల్ డీసీపీ ఆఫీస్‌లో హాజరుకావాలని పోలీసులు పేర్కొన్నారు.

తనకు నోటీసులు ఇచ్చిన మాట వాస్తవమే అని...దీనిపై న్యాయవాదులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాని తెలిపారు. అయితే ముందుగా ఖరారు అయిన కార్యక్రమాల వాళ్ళ తాను శుక్రవారం విచారణకు హాజరు కాలేను అని...ఈ నెల పదవ తేదీన విచారణకు వస్తానని ఈటల పోలీస్ అధికారులకు లేఖ రాశారు. మరి దీనిపై పోలీస్ లు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. రాతలకు నోటీసు ల అంశంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. వాట్సాప్ మెసేజ్ ల ఆధారంగా నోటీసు లు ఇవ్వటం ఎక్కడ లేదు అన్నారు. తెలంగాణ ప్రజలు ఈ పరిణామాలు అన్ని గమనిస్తున్నారని మండిపడ్డారు. పోలీస్ లను తమ సొంత అవసరాలకు వాడుకోవటం సీఎం కెసిఆర్ కు బాగా అలవాటు అంటూ విమర్శించారు.

Next Story
Share it