తెలంగాణలో పదవ తరగతి పరీక్షలు రద్దు
ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్ధులు ప్రమోట్..సెకండ్ ఇయర్ పరీక్షలు వాయిదా
సీబీఎస్ఈ తరహాలోనే తెలంగాణ సర్కారు కూడా కీలక నిర్ణయం తీసుకుంది. పదవ తరగతి పరీక్షలు రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. విద్యార్ధులకు మార్కుల కేటాయింపు విషయంలోనూ సీబీఎస్ఈ మోడల్ నే ఫాలో కావాలని నిర్ణయించారు. అదే సమయంలో ఎవరైనా తమకు కేటాయించిన మార్కులపై సంతృప్తి చెందకపోతే పరిస్థితులు చక్కబడిన తర్వాత పరీక్షలు రాయటానికి అనుమతిస్తారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రారామచంద్రన్ ఆదేశాలు జారీ చేశారు.
అదే సమయంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్ధులను ప్రమోట్ చేయనున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలను వాయిదా వేశారు. దీంతోపాటు సెకండ్ ఇయర్ విద్యార్ధులకు ఫస్ట్ ఇయర్ లో బ్యాగ్ లాగ్స్ ఉంటే వారికి మాత్రం పాస్ మార్కులు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది ఎంసెట్ లో ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజ్ ఉండదని స్పష్టం చేశారు.