Telugu Gateway
Telangana

ఎత్తైన భవనాల్లో ముంబై తర్వాత హైదరాబాదే!

ఎత్తైన భవనాల్లో ముంబై తర్వాత హైదరాబాదే!
X

హైదరాబాద్ న్యూ సిటీ అంటే ముఖ్యంగా ఐటి కారిడార్, కోకాపేట ప్రాంతాలు ఎవరూ ఊహించని రీతిలో మారిపోతున్నాయి. అటు ఆఫీస్ స్పేస్ తో పాటు పెద్ద ఎత్తున నివాస సముదాయాలు వెలుస్తున్నాయి. అందులో ఎక్కువగా హై రైజ్ భవనాలదే అగ్రస్థానం అని చెప్పొచ్చు. వచ్చే నాలుగైదు సంవత్సరాల్లో ఏకంగా పదికి పైగా హై రైజ్ భవనాలు ఈ ప్రాంతంలో రాబోతున్నాయి. ఈ జాబితాను తాజాగా తెలంగాణ మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఇందులో ఎక్కువ అంతస్తులు ఉన్న భవనం అంటే పుప్పాలగూడలో క్యాండూర్ స్కై లైన్ ప్రాజెక్ట్ ఒకటి. ఈ భవనం 59 అంతస్తులతో రానుంది.

తర్వాత 58 అంతస్తులతో సాస్ క్రౌన్ ప్రాజెక్ట్, 57 అంతస్తులతో ది ట్రిలైట్ టవర్, 50 ఫ్లోర్స్ తో ది ట్రిలైట్ టవర్ త్రీ, 55 ఫ్లోర్స్ తో శ్రీయాస్ డైమండ్ టవర్స్, 54 అంతస్తులతో మై హోమ్ 99 , 52 ఫ్లోర్స్ తో యూ హైదరాబాద్ మై స్పేస్ , 54 అంతస్తులతో పౌలోమి పాలజ్జు , క్యాండూర్ క్రీసెంట్ ప్రాజెక్ట్ 50 అంతస్తులతో రానుంది. శ్రీయాస్ డైమండ్ టవర్స్ 48 ఫ్లోర్స్ తో నిర్మించనున్నాయి. ఈ పది ప్రాజెక్ట్ ల్లో నాలుగు కోకాపేట లో ఉంటే, మరో నాలుగు పుప్పాల గూడ లో రాబోతున్నాయి. ప్రభుత్వం చెపుతున్న లెక్కల ప్రకారమే ఇవి పూర్తి కావటానికి నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు పట్టనుంది. ఇవన్నీ పూర్తి అయితే హైదరాబాద్ లుక్ మరింత మారే అవకాశం ఉంది అధికారులు చెపుతున్నారు.

Next Story
Share it