కెనడా తరహాలో తెలంగాణలో వైద్యవిధానం
ప్రపంచంలోనే అత్యుత్తమ వైద్య విధానం కెనడాలో ఉందని..దీనిపై అధ్యయనానికి అక్కడకు నిపుణులను పంపించనున్నట్లు ముఖ్యమంత్రి కెసీఆర్ వెల్లడించారు. ఆ తర్వాత తెలంగాణలో కెనడాను మించిన వైద్య విధానం అమలు చేస్తామన్నారు. వైద్యరంగం మీద దాడులు సరికావని కెసీఆర్ వ్యాఖ్యానించారు. చైనాలో 28 గంటల్లో 10 అతస్తుల భవనం కట్టారు. ఈ తరహా పద్దతులు దేశంలో కూడా రావాలన్నారు. ఏడాదిన్నరలో వరంగల్ లో అత్యాధునిక ఆసుపత్రి భవనాన్ని నిర్మించాలని ఆదేశించారు. కరోనాపై దుష్ప్రచారం సరికాదు. నాకు కూడా కరోనా వచ్చింది. కరోనా వస్తే టెంపరేచర్ పెరుగుతుంది. పారాసిటమాల్ వేసుకోమని డాక్టర్ చెప్పారు. నాకు కరోనా వచ్చినప్పుడు కేవలం పారాసిటమాల్ మాత్రమే వేసుకున్నా. ప్రజల్లో లేనిపోని భయాందోళనలు సృష్టించొద్దని కెసీఆర్ సూచించారు. సోమవారం నాడు వరంగల్ జిల్లాలో పర్యటించిన కెసీఆర్ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తెలంగాణలో పరిపాలన సంస్కరణలు తీసుకొచ్చామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. వరంగల్ పరిశ్రమల కేంద్రంగా కావాలని ఆయన తెలిపారు.
వరంగల్ అర్బన్ జిల్లాను హన్మకొండగా మారుస్తున్నామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. వరంగల్ రూరల్ వరంగల్ జిల్లాగా ఉంటుందన్నారు. ఇకపై హన్మకొండ, వరంగల్ జిల్లాలు ఉంటాయన్నారు. ఇతర జిల్లాల్లో కలెక్టరేట్ భవనాలు చాలా బాగున్నాయన్నారు.న్ననే వరంగల్ జిల్లాలకు వెటర్నరీ కళాశాలను మంజూరు చేసినట్లు తెలిపారు. కలెక్టర్ పేరు కూడా మార్చాలన్నారు. అది బ్రిటిష్ కాలంలో పెట్టిన పేరు అని తెలిపారు. ధరణి పోర్టల్‌తో రిజిస్ట్రేషన్ సమస్యలు తీరాయన్నారు. పారదర్శకత పెరిగితే పైరవీలు ఉండవన్నారు. వరంగల్ విద్యా, వైద్య, పరిశ్రమల కేంద్రం కావాలని సీఎం ఆకాంక్షించారు. రాష్ట్రం మొత్తం హైదరాబాద్ పై ఆధారపడితే జిల్లాలకు నష్టం జరుగుతుందని వ్యాఖ్యానించారు. ఇతర జిల్లాలు కూడా డెవలప్ అయితే సమతూకం వస్తుందని తెలిపారు. హైదరాబాద్ తోపాటు రాష్ట్రంలో మరో నాలుగు నగరాలు డెవలప్ కావాల్సిన అవసరం ఉందన్నారు.