Telugu Gateway
Telangana

టీఆర్ఎస్ లో టీడీపీ శాసనసభాపక్షం విలీనం

టీఆర్ఎస్ లో టీడీపీ శాసనసభాపక్షం విలీనం
X

తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి మరో ఎదురుదెబ్బ. ఇప్పటివరకూ ఉన్న ఒకే ఒక ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వరరావు కూడా టీఆర్ఎస్ లో చేరారు. ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న సండ్ర వెంకటవీరయ్య టీఆర్ఎస్ గూటికి చేరిన విషయం తెలిసిందే. తాజాగా ఇద్దరూ ఎమ్మెల్యేలు కలసి తెలంగాణ శాసనసభా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని కలసి టీడీఎల్పీని టీఆర్ఎస్ లో విలీనం చేస్తున్నట్లు లేఖ అందజేశారు. వీరు శాస‌న స‌భ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డితో కూడా భేటీ అయ్యారు.

తాజా చేరికలతో అసెంబ్లీలో టీఆర్ఎస్ బలం మరింత పెరిగినట్లు అయింది. అదే సమయంలో సభో టీడీపీ ప్రాతినిధ్యం లేకుండా పోయినట్లు అవుతుంది. గతంలో అధికార టీఆర్ఎస్ ఇలాగే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకుని శాసనసభాపక్షం విలీనం అంటూ లేఖలు ఇఫ్పించింది. కాంగ్రెస్ నుంచి 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తినా ఆ పార్టీ అదేమీ పట్టించుకోలేదు. ఇప్పుడు టీడీపీ విలీనం కూడా అదే దిశలో సాగింది. స్పీకర్ కు విలీన లేఖను అందజేసిన తర్వాత వీరిద్దరూ ముఖ్యమంత్రి కెసీఆర్ తో సమావేశం అయ్యారు.

Next Story
Share it