Telugu Gateway
Telangana

తెలంగాణాలో మే 15 వరకూ ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ వేయరు

తెలంగాణాలో మే 15 వరకూ ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ వేయరు
X

రెండవ డోస్ వ్యాక్సిన్ కే ప్రాధాన్యత

రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ ప్రక్రియకు మరోసారి బ్రేక్ పడింది. ఇప్పటికే పలుమార్లు స్వల్ప విరామం ఇచ్చారు. ఇప్పుడు తొలి డోస్ వ్యాక్సిన్ మే 15 వరకూ ఆగిపోనుంది. ఈ విషయాన్ని తెలంగాణ వైద్య శాఖ వెల్లడించింది. రాష్ట్రానికి అవసరానికి తగ్గ మోతాదులో వ్యాక్సిన్లు రాని కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మొదటి డోస్‌కు బ్రేక్‌ ఇచ్చి రెండో డోస్‌ కంప్లీట్‌ చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో మే 15 వరకు ఫస్డ్‌ డోస్‌ వ్యాక్సినేషన్‌ నిలిచిపోనుంది.

శనివారం నుంచి రెండో డోసు వ్యాక్సినేషన్‌ ప్రారంభం కానుంది. రాష్ట్రంలో రెండవ డోస్ వ్యాక్సిన్ తీసుకోవాల్సిన వారు పదకొండు లక్షల వరకూ ఉన్నారని ఓ అంచనా. గురువారం నాడు ముఖ్యమంత్రి కెసీఆర్ కూడా ప్రధాని నరేంద్రమోడీతో మాట్లాడిన సమయంలో రాష్ట్రానికి అవసరమైన వ్యాక్సిన్లు సరఫరా చేయాలని కోరిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఇదే అంశంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ సోమేష్ కుమార్ కేంద్రానికి లేఖ రాశారు.

Next Story
Share it