Telugu Gateway
Telangana

ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ పరిస్థితి బెటర్

ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ పరిస్థితి బెటర్
X

రాష్ట్రంలో అందరికీ వ్యాక్సిన్ అందించేందుకు వీలుగా త్వరలోనే తయారీదారులతో సమావేశం కానున్నట్లు తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కెటీఆర్ వెల్లడించారు. కరోనా చికిత్సకు అవసరమైన మందుల తయారీ దారులతో పాటు... వ్యాక్సిన్ తయారీదారులతో సమావేశం అవుతామన్నారు.ప్రభుత్వం ప్రజల ప్రాణాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకునేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. ఇతర రాష్ట్రాల పరిస్థితులతో పోలిస్తే తెలంగాణలో మంచి పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం కెటీఆర్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ తొలి సమావేశంలో బుధవారం నాడు సచివాలయంలో జరిగింది. సమావేశం అనంతరం మంత్రి కెటీఆర్ మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలో రెమిడెవిసర్ లాంటి మందుల నిల్వలు ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 1.5 లక్షల ఇంజెక్షన్లు ఉన్నాయి. రాష్ట్రంలో ఇంజెక్షన్లు తయారుచేస్తున్న కంపెనీల నుంచి అదనపు సరఫరాకు సమన్వయము చేస్తాం. బ్లాక్ ఫంగస్ అంశంలో కూడా ప్రభుత్వం అలెర్ట్ గా ఉంది... దీనికి అవసరం అయిన మందులను ప్రభుత్వం సేకరిస్తోంది. ఆక్సిజన్ సప్లై గురించి కూడా చర్చించాము, ప్రస్తుతానికి అవసరము అయిన డిమాండ్- సప్లై పైన వివరాలు తీసుకున్నాం. ప్రభుత్వము ఆక్సిజన్ ఆడిట్ చేస్తుంది.... అన్ని ప్రైవేట్ ఆస్పత్రుల తో ఆక్సిజన్ వినియోగానికి అవసరమైన మేరకే వాడేలా చర్యలు తీసుకోవాలన్నారు.

Next Story
Share it