తెలంగాణ స్కూళ్లు...ప్రత్యక్ష బోధన పాఠశాలల ఇష్టమే
ప్రత్యక్ష బోధన పాఠశాలల ఇష్టం. స్కూలుకు హాజరు కావాలా వద్దా అన్నది పిల్లల ఇష్టం. ఎవరినీ బలవంతం చేయవద్దు. స్కూళ్లు తెవరవని వారిపై...బడికి రానివారిపై చర్యలు తీసుకోవద్దు. అయితే గురుకులాలు, హాస్టళ్ళ తెరవద్దని మాత్రం తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. తెలంగాణలో పాఠశాలల ప్రారంభానికి సంబంధించి తెలంగాణ హైకోర్టు మంగళవారం నాడు కీలక ఆదేశాలు జారీ చేసింది. పిల్లలను తప్పనిసరిగా స్కూళ్ళకు రావాలంటూ ఎవరూ ఒత్తిడి చేయవద్దని ఆదేశించింది. సెప్టెంబర్ 1 నుంచి తప్పనిసరిగా స్కూళ్ళు తెరవాలంటూ సర్కారు తాజాగా ఆదేశాలు జారీ చేసింది.
అయితే స్కూళ్ళు ప్రారంభించని వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోరింది. పిల్లలపై ఒత్తిడి తేవద్దని..అదే సమయంలో పిల్లల తల్లి దండ్రులనుంచి ఎలాంటి హామీ పత్రాలు కోరవద్దని పేర్కొంది. సర్కారు జీవోపై స్టేకు మాత్రం నిరాకరించింది. దీంతో ఇప్పుడు ఆప్షన్ పాఠశాలలు..పిల్లలకే వదిలేసినట్లు అయింది. అయితే ఇంకా కోవిడ్ సమస్య ముగిసిపోలేదని కోర్టు అభిప్రాయపడింది. ప్రత్యక్ష బోధనకు సంబంధించి ప్రభుత్వం, పాఠశాలలు మరింత సమన్వయంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని పేర్కొంది.