Telugu Gateway
Telangana

తెలంగాణ పీఆర్సీ నివేదిక బహిర్గతం..7.5 శాతం ఫిట్ మెంట్ సిఫారసు

తెలంగాణ పీఆర్సీ నివేదిక బహిర్గతం..7.5 శాతం ఫిట్ మెంట్ సిఫారసు
X

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వేతన సవరణ సంఘం (పీఆర్ సీ) నివేదిక బయటకు వచ్చింది. పీఆర్ సీపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఉద్యోగులు ఈ నివేదికను చూసి షాక్ కు గురయ్యారని చెప్పొచ్చు. మూల వేతనంపై 7.5% ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని పీఆర్‌సీ తన నివేదికలో పొందుపర్చింది. ఈ సిఫారసుపై ఉద్యోగ సంఘాలు భగ్గుమంటున్నాయి. అసలు ఏ ప్రాతిపదికన ఈ సిఫారసు చేశారో అర్ధం కావటంలేదని ఉద్యోగులు అవాక్కు అవుతున్నారు.

బుధవారం మధ్యాహ్నం ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం వివరాలు ఇవ్వనుంది. ఉద్యోగి కనీస వేతనం 19వేలు ఉండాలని వేతన సంఘం సిఫార్సు చేసింది. మరోవైపు ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60ఏళ్లకు పెంచాలని సూచించింది. హెచ్‌ఆర్‌ఏ తగ్గిస్తూ సిఫార్సు చేసిన వేతన సవరణ సంఘం, గ్రాట్యూటీ పరిమితి 12లక్షల నుంచి 16లక్షల రూపాయలకు పెంచాలని కోరింది. 2018జులై 1నుంచి వేతన సవరణ అమలుకు కమిషన్‌ సిఫార్సు చేసింది.

Next Story
Share it