Top
Telugu Gateway

తెలంగాణాలో పాజిటివిటి రేటు బాగా తగ్గింది

తెలంగాణాలో పాజిటివిటి రేటు బాగా తగ్గింది
X

రాష్ట్రంలో గత రెండు వారాలుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని తెలంగాణ హెల్త్ డైరక్టర్ జి.శ్రీనివాసరావు వెల్లడించారు. వైద్య ఆరోగ్యశాఖ తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని అన్నారు. ఆయన మంగళవారం నాడు హైదరాబాద్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. పాజిటివిటి రేటు కూడా గణనీయంగా తగ్గిందని వెల్లడించారు. తెలంగాణలో దేశంలో కరోనా కట్టడికి మార్గదర్శకంగా నిలిచిందని వ్యాఖ్యానించారు. గ్రామాల్లో కూడా కరోనా నియంత్రణలోనే ఉందని, ఇంటింటి సర్వే ద్వారా కరోనా బాధితులను గుర్తించి వారికి మందులు అందిస్తున్నట్లు తెలిపారు.

రాష్ట్రంలో మరణాల రేటు 0.56 శాతంగా ఉందని తెలిపారు. ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించటం వల్లే సత్ఫలితాలు వస్తున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ రోగులకు సరిపడా పడకలు ఉన్నాయని శ్రీనివాసరావు వెల్లడించారు. తెలంగాణలో రికవరి రేటు 90.48 శాతంగా ఉందని, రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ఎప్పటి నుంచి ప్రారంభించేది త్వరలోనే వెల్లడిస్తామన్నారు. వ్యాక్సినేషన్ మధ్యలో ఆపకూడదని భావిస్తున్నామని..ఎక్కువ వ్యాక్సిన్లు రాగానే తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు. బ్లాక్ ఫంగస్ అంటు వ్యాధి కాదని అన్నారు.

Next Story
Share it