కెసీఆర్ ను కాపాడుకోవాలి

X
Admin16 Feb 2021 3:44 PM GMT
తెలంగాణ లో షర్మిల పార్టీ ఏర్పాట్లపై మంత్రి గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు జగన్ బాణం షర్మిల వచ్చారని..తర్వాత జగన్, ఆయన వెనక చంద్రబాబు కూడా వస్తారని అన్నారు. ఇదే జరిగితే తెలంగాణలో మళ్లీ కొట్లాటలు తప్పవని, కేసీఆర్‌ను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. లేకపోతే మళ్ళీ సమైక్య రాష్ట్రం అవుతుందని హెచ్చరించారు. ఆంధ్రా నేతలు కరెంటు, నీళ్లు ఎత్తుకపోతారని, కేసీఆరే రక్షకుడని గంగుల వ్యాఖ్యానించారు.
Next Story