Telugu Gateway
Telangana

దురుద్దేశ పూరితం...కల్పితం

దురుద్దేశ పూరితం...కల్పితం
X

తెలంగాణ కు ఆంధ్ర ప్రదేశ్ ఇసుక. రాష్ట్రంలో ఇసుక కొరత ఏర్పడింది. రేటు డబల్ అయింది అంటూ నమస్తే తెలంగాణ పత్రిక సోమవారం నాడు ఒక కథనం ప్రచురించింది. ఇది పూర్తిగా నిరాధారం...తప్పుడు వార్త అని ..కావాలని దురుద్దేశపూరితంగా ఈ వార్త రాసినట్లు కనిపిస్తోంది అంటూ గనుల శాఖ నమస్తే తెలంగాణకు ఘాటు రిప్లై ఇచ్చింది. ఆంధ్ర ప్రదేశ్ నుంచి తెలంగాణ కు ఇసుక వస్తోంది అనే దాంట్లో ఏ మాత్రం నిజం లేదు అని..అలాంటి ప్రయత్నాలు జరిగినా అడ్డుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ రెండు మొబైల్ టీమ్స్ ను ఏర్పాటు చేసింది అని అందులో తెలిపారు.

అదే సమయంలో రాష్ట్రంలో ఎలాంటి ఇసుక కొరత లేదు అని...రాష్ట్ర అవసరాలకు సరిపడినన్ని నిల్వలు ఉన్నట్లు స్పష్టం చేశారు. టిఎస్ ఎండిసి సరిగానే వెబ్ సైట్ పని చేస్తుంది అని..ఇందులో ఎలాంటి సమస్యలు లేవు అని తెలిపారు. 2024 జనవరి లో బుకింగ్ కోసం 31.75 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉండగా...14 .76 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక ఆన్ లైన్ లో బుక్ చేసుకున్నారు అని...60 .69 కోట్ల రూపాయల మేర ప్రభుత్వ ఖజానాకు ఆదాయం వచ్చింది అని తెలిపారు. బుకింగ్ కోసం స్టాక్ యార్డ్ లో 16 .99 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.

Next Story
Share it