Telugu Gateway
Telangana

లాక్ డౌన్ మార్గదర్శకాలు జారీ

లాక్ డౌన్ మార్గదర్శకాలు జారీ
X

ప్రైవేట్ ఆఫీసులు ఓపెన్ కు గ్రీన్ సిగ్నల్

అంతరాష్ట్ర రవాణాకు నో

బార్లు..పబ్బులకూ నో ఛాన్స్

తెలంగాణ సర్కారు రాష్ట్రంలో లాక్ డౌన్ ను మే 31 నుంచి మరో పది రోజులు పొడిగించిన విషయం తెలిసిందే. అయితే ఈ సారి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ వెసులుబాటు కల్పించింది. అయితే ఈ సమయంలో ఏమేమి చేయవచ్చు..ఏమి చేయకూడదో వివరిస్తూ జీవో జారీ చేసింది. లాక్ డౌన్ సమయంలో సినిమా హాళ్లు. అమ్యూజ్ మెంట్ పార్కులు, స్విమ్మింగ్ పూల్స్, బార్లు, పబ్బులు, జిమ్ లు, స్టేడియాలు పూర్తిగా మూసివేసి ఉంచాలని ఆదేశించారు. అయితే సరిహద్దుల వద్ద ఈ పాస్ లు ఉన్న వాహనాలను మాత్రమే అనుమతించనున్నారు. సరుకు రవాణా వాహనాలకు మాత్రం ఎలాంటి ఆటంకాలు ఉండవు.

రాష్ట్రంలో టీఎస్ఆర్ టీసీ, సెట్విన్, హైదరాబాద్ మెట్రో, ఆటోలు, ట్యాక్సీలను ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకూ అనుమతిస్తారు. అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులు ఏవీ కూడా అనుమతించరు. ప్రైవేట్ షాపులు/ఎస్టాబ్లిష్ మెంట్స్/ఆఫీసులు వెసులుబాటు కల్పించిన సమయంలో ఓపెన్ చేసుకోవచ్చు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు తమ తమ ఉద్యోగులు, కార్మికులకు పూర్తి వేతనాలు చెల్లించాలి. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల విషయంలోనూ ఇది వర్తిస్తుంది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. లాక్ డౌన్ సమయంలోనూ అత్యవసర సర్వీసులను అనుమతిస్తారు.

Next Story
Share it