తెలంగాణలో రేపటినుంచే లాక్ డౌన్
BY Admin11 May 2021 10:08 AM

X
Admin11 May 2021 10:08 AM
ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకే షాపులు
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం నుంచే లాక్ డౌన్ అమల్లోకి తేవాలని నిర్ణయం తీసుకున్నారు. మే 12, బుధవారం ఉదయం 10 గంటలనుంచి పదిరోజుల పాటు లాక్ డౌన్ అమలు చేయాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. ప్రతిరోజూ ఉదయం 6 గంటలనుండి 10 గంటల వరకు అన్నీ కార్యకలాపాలకు అవకాశం వుంటుందని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో టీకా కొనుగోలు కొరకు గ్లోబల్ టెండర్లను పిలవాలని క్యాబినెట్ నిర్ణయించింది. లాక్ డౌన్ సమయంలో ఖచ్చితంగా నిబంధనలు అమలు చేయననున్నారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేయనున్నారు. ఓ వైపు హైకోర్టు లాక్ డౌన్ లపై హైకోర్టు పలు ప్రశ్నలు సంధిస్తూ వస్తోంది. ఈ తరుణంలో మంగళవారం నాడు సమావేశం అయిన కేబినెట్ చివరకు లాక్ డౌన్ వైపు మొగ్గుచూపింది.
Next Story