Telugu Gateway
Telangana

ఏ శాఖ‌లో ఎన్ని ఖాళీలు..ఆ వివ‌రాలు

ఏ శాఖ‌లో ఎన్ని ఖాళీలు..ఆ వివ‌రాలు
X

తెలంగాణ స‌ర్కారు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు అన్నింటిని భ‌ర్తీ చేయాల‌ని నిర్ణ‌యించింది. తెలంగాణలో ఉద్యోగ ఖాళీలు 91,142 అయితే అందులో 11,103 మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయ‌టం ద్వారా పూరించ‌నున్నారు. మిగిలిన 80,039 ఉద్యోగాలకు తక్షణమే నోటిఫికేషన్ లు వెలువ‌డ‌నున్నాయి. ఏయే శాఖ‌లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో సర్కారు జాబితా విడుద‌ల చేసింది. ఆ వివ‌రాలు ఇలా ఉన్నాయి.

హోంశాఖలో 18,334 ఉద్యోగాలు

మాధ్యమిక విద్య 13, 086 ఉద్యోగాలు

వైద్య, ఆరోగ్యశాఖ 12,755 ఉద్యోగాలు

విద్యాశాఖలో 7,878 ఉద్యోగాలు భర్తీ

బీసీ సంక్షేమశాఖలో 4,311 ఉద్యోగాలు

ఎస్సీ సంక్షేమశాఖలో 2,879 ఉద్యోగాలు

రెవెన్యూశాఖలో 3,560 ఉద్యోగాలు

నీటిపారుదలశాఖలో 2,692 ఉద్యోగాలు

గిరిజన సంక్షేమశాఖలో 2,399 ఉద్యోగాలు

పర్యావరణం, అటవీ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ 1,598 ఉద్యోగాలు

పంచాయతీరాజ్‌శాఖలో 1,455 ఉద్యోగాలు

కార్మికశాఖలో 1,221 ఉద్యోగాలు

ఆర్థికశాఖలో 1,146 ఉద్యోగాలు

స్త్రీ, శిశుసంక్షేమశాఖలో 895 ఉద్యోగాలు

మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌శాఖలో 859 ఉద్యోగాలు

వ్యవసాయశాఖలో 801 ఉద్యోగాలు

రోడ్డు రవాణాశాఖలో 563 ఉద్యోగాలు

పశుసంవర్ధకశాఖలో 353 ఉద్యోగాలు

జనరల్‌ అడ్మినిస్ట్రేషన్‌ 343 ఉద్యోగాలు

పరిశ్రమలు, వాణిజ్యశాఖలో 233 ఉద్యోగాలు

ప‌ర్యాట‌క శాఖలో 184 ఉద్యోగాలు

ప్లానింగ్‌ డిపార్ట్‌మెంట్‌లో 136 ఉద్యోగాలు

సివిల్‌ సప్లైశాఖలో 106 ఉద్యోగాలు

అసెంబ్లీలో 25 ఉద్యోగాలు

విద్యుత్‌శాఖలో 16 ఉద్యోగాలు

Next Story
Share it