Telugu Gateway
Telangana

తెలంగాణ ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్

తెలంగాణ ఇంటర్ ఫలితాల  ముహూర్తం ఫిక్స్
X

ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ ఫలితాలు విడుదల చేసే తేదీ, సమయం ప్రకటించింది. ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ లో ఫలితాలు విడుదల కాగా..తెలంగాణ సర్కారు మాత్రం ఈ విషయం లో ఇంతకాలం మౌనం దాలుస్తూ వచ్చింది. ఎప్పుడో స్పాట్ వాల్యుయేషన్ పూర్తి అయినా కూడా ప్రభుత్వం ఫలితాల విడుదలపై నిర్ణయం ప్రకటించ కుండా జాప్యం చేసింది. దీంతో విద్యార్థులు ఒకింత టెన్షన్ తో గడుపుతున్నారు. ఫలితాలు వస్తే మళ్ళీ కొంతమంది ఇంప్రూవ్ మెంట్ రాస్తారు...తప్పిన వాళ్ళు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కు సిద్ధం కావాల్సి ఉంటుంది. గత కొన్ని రోజులుగా విద్యార్థులు ప్రభుత్వ ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఈ ప్రకటన వచ్చింది.

దీని ప్రకారం తెలంగాణ ఇంటర్ ఫలితాలు మంగళవారం నాడు అంటే మే 9 ..ఉదయం పదకొండు గంటలకు విడుదల కానున్నాయి. విద్య శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇంటర్ పరీక్షలు పూర్తి అయి నలభై రోజులు దాటింది. ఇంటర్ ఈస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి మొత్తం 9 . 5 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు ఈ పరీక్షలు జరిగాయి. ఇంటర్ బోర్డు వెబ్ సైట్ తో పాటు అన్ని మీడియా సంస్థల వెబ్ సైట్స్ లో ఈ ఫలితాలు అందుబాటులో ఉంటాయి.


Next Story
Share it