Telugu Gateway
Telangana

అంబులెన్స్ లు ఆపే హక్కు ఎవరిచ్చారు?

అంబులెన్స్ లు ఆపే హక్కు ఎవరిచ్చారు?
X

తెలంగాణ సర్కారుపై హైకోర్టు ఆగ్రహం..సర్కులర్ పై స్టే

జాతీయ రహదారులపై వచ్చే అంబులెన్స్ లను ఆపే హక్కు మీకు ఎవరు ఇచ్చారు?. ఇది జాతీయ రహదారుల చట్టాన్ని ఉల్లంఘించినట్లే. రాజ్యాంగాన్ని..కోర్టులను పట్టించుకోరా.. అంబులెన్స్ లను ఆపొద్దని హైకోర్టు స్పష్టంగా చెప్పినా ఎందుకు ఇలా చేస్తున్నారు అంటూ తెలంగాణ సర్కారుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ముందస్తుగా కంట్రోల్ రూమ్ లో అనుమతి తీసుకున్న తర్వాత హైదరాబాద్ లోని ఆస్పత్రులకు రావాలంటూ జారీ చేసిన సర్కులర్ ను తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకూ నిలిపివేసింది. 'పేషంట్లను క్యారీ చేస్తున్న అంబులెన్స్ లను ఆపడం ఎక్కడైనా చూశామా?. రైట్ టు లైఫ్ ను ఆపడానికి మీకు ఏం అధికారం ఉందని హైకోర్టు ప్రశ్నించింది. ఢిల్లీ , మహారాష్ట్ర లో కూడా ఇలాంటి నిబంధన అమల్లో ఉందని తెలంగాణ అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన ప్రధాన న్యాయమూర్తి హిమా కొహ్లి ఏ రాష్ట్రం లో కూడా ఇలాంటి నిబంధన తాము చూడ లేదన్నారు.

ఇతర రాష్ట్రాల్లో పోలిస్తే తెలంగాణ చాలా మేలు చేస్తుందని, ఇతర రాష్ట్రాల్లో నెగిటివ్ రిపోర్ట్ లేకుంటే అసలు ఎంట్రీ నే లేదన్నారు. ఢిల్లీ, మహారాష్ట్ర ల్లో సైతం ఇలాంటి నిబంధన ఉందని కోర్టు తెలిపారు. పేషంట్స్ సరిహద్దుల్లో చనిపోతున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది. రాష్ట్ర పౌరులకు సంబందించిన బాధ్యత ప్రభుత్వం పై ఉందని అడ్వకేట్ జనరల్ వాదించారు. అధికారులు కరోనా పై రివ్యూ చేసి ఇతర రాష్ట్రాలకు ఈ సర్క్యులర్ జారీ చేశారని తెలిపారు. తెలంగాణ హైకోర్టులో జరిగిన విచారణలో ఏపీ సర్కారు కూడా జోక్యం చేసుకుంది. ఏపీ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అడ్వకేట్‌ జనరల్‌ శ్రీరాం వాదనలు విన్పించారు. ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రం వెళ్లడం, ప్రయాణాలు చేయడం అన్నది పౌరులకున్న ప్రాథమిక రాజ్యంగంలోని 19, 21 అధికరణాల ప్రకారం దేశంలో ఏ పౌరుడైనా ఎక్కడికైనా వెళ్లవచ్చు.

తెలంగాణ ప్రభుత్వం నియంత్రణలు రాజ్యాంగ విరుద్ధం. ఎపిడిమిక్‌ యాక్ట్, నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌–2005లు ఆధారంగా చేసుకుని తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన సర్క్యులర్‌ చెల్లదు. రోగులు నివాసం ఆధారంగా వారిపై వివక్ష చూపడమన్నది వారిహక్కులకు భంగం కలిగించడమే. ఎపిడిమిక్‌ యాక్ట్, నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌–2005లు ఆధారంగా చేసుకుని పౌరుల్లో వీరు మావాళ్లు, వీరు మావాళ్లు కాదు అన్న వర్గీకరణ చేయడం అన్నది రాజ్యాంగ విరుద్ధం అవుతుంది.

తెలంగాణ ప్రభుత్వం జాగ్రత్తలు అన్న వేటినైతే చెప్తోందో అవి తెలంగాణలో నివాసం ఉన్నవారికి వర్తించవా? కేవలం నివాస స్థలం ఆధారంగా హైదరాబాద్‌లో చికిత్సకు రావొచ్చో, లేదో అర్హతలు నిర్ణయిస్తారా?. వైద్యంకోసం వస్తున్న పౌరుల కదిలికలపై నియంత్రణ లేదా ఆంక్షలు విధించండం అన్నది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. వేరే రాష్ట్రానికి చెందినవారన్న కారణంతో వారికోసం ప్రత్యేకంగా ఆంక్షలు నియంత్రణలు విధించడం రాజ్యాంగ విరుద్ధం, ఏ చట్టం కింద కూడా అలాంటి నియంత్రణలు వి«ధించకూడదు.. వైద్యపరంగా మౌలికసదుపాయాలు అన్నవి రాష్ట్రాలతో సంబంధంలేకుండా ఏర్పాటైనవి, ఇవి జాతి మొత్తానికి సంబంధిచిన ఆస్తులు అని రాష్ట్రాల మధ్య నిరంతరం చక్కటి సమన్వయం ఉండాలని ఇటీవలే సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా జారీచేసిందని తెలిపారు.

Next Story
Share it