Telugu Gateway
Telangana

తెలంగాణ సర్కారుపై హైకోర్టు సీరియస్

తెలంగాణ సర్కారుపై హైకోర్టు సీరియస్
X

తెలంగాణ కరోనా పరీక్షలు సాగుతున్న తీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. జీహెచ్ఎంసీ ఫలితాలేమో కానీ, ఎన్నికలయ్యాక కరోనా రెండో దశ ఫలితాలు వచ్చేలా ఉన్నాయని వ్యాఖ్యానించింది. రెండో దశ కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు కనిపించడం లేదని ఆక్షేపించింది. కరోనా పరీక్షలపై గురువారం విచారణ చేపట్టిన హైకోర్టు రోజుకు 50 వేల పరీక్షలు చేయాలన్న కోర్టు ఆదేశాలను ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. అవసరం ఉన్నప్పుడు రోజుకు 50వేల పరీక్షలు చేస్తామని నివేదికలో పేర్కొనడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

హెల్త్ డైరక్టర్ శ్రీనివాస రావుపై కోర్టు ధిక్కరణ నోటీసులు ఇస్తామని హైకోర్టు హెచ్చరించింది. ఎక్కువ ఫిర్యాదులు వస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. యశోద, కిమ్స్, కేర్, సన్ షైన్ ఆస్పత్రులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. జీహెచ్ఎంసీలో మాస్క్ లతోపాటు భౌతిక దూరం విషయంలో నిబంధనలు పాటించలేదని పేర్కొంది.

Next Story
Share it