Telugu Gateway
Telangana

లాయర్ల హత్యలపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

లాయర్ల హత్యలపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
X

'లాయర్ల హత్య ప్రభుత్వ విశ్వాసాన్ని ప్రశ్నించేలా ఉంది. ప్రభుత్వం తన విశ్వాసాన్ని నిలుబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సాక్ష్యాలను పకడ్బందీగా సేకరించాలి. ఈ కేసులో నిందితులను త్వరగా పట్టుకోవాలి' అని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి హిమా కొహ్లి నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ హత్య కేసును సుమోటోగా తీసుకుంటున్నామని పేర్కొంది. అనంతరం విచారణను మార్చి ఒకటికి వాయిదా వేసింది. ఈ హత్యలపై సమగ్ర నివేదిక అందజేయాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది.

న్యాయవాద దంపతులు గట్టు వామన్‌రావు- వెంకట నాగమణి హత్య కేసుకు నిరసనగా హైకోర్టుతోపాటు నగరంలోని అన్ని కోర్టుల్లో న్యాయవాదులు గురువారం నాడు విధులు బహిష్కరించి నిరసనలు తెలిపారు. నేడు విచారణకు వచ్చే అన్ని కేసులను లాయర్లు బహిష్కరించారు. రంగారెడ్డి కోర్టుల దగ్గర న్యాయవాదులు ధర్నాకు దిగటంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Next Story
Share it