రేవంత్ మాటలు కోటలు దాటతాయి కానీ...!

ప్రభుత్వ బడ్జెట్ లెక్కలు చూస్తే మాత్రం లక్షల కోట్ల రూపాయలు ఉంటాయి. కానీ ప్రజల కనీస అవసరాలు తీర్చేందుకు...చివరకు సచివాలయంలో పని చేసే ఉద్యోగులకు మంచి నీటి సరఫరా చేసిన వాళ్లకు కూడా బిల్లులు చెల్లించలేని స్థితిలో తెలంగాణ సర్కారు ఉందా అన్న చర్చ సాగుతోంది. ప్రభుత్వానికి ఇంత కంటే అవమానం ఏమి ఉంటుంది. ఆ మొత్తం కూడా 50 లక్షల రూపాయలు అని చెపుతున్నారు. తెలంగాణ సర్కారు లో ఏ బిల్లు చెల్లించాలి అన్నా కూడా కమిషన్స్ ఇస్తే తప్ప క్లియర్ కావటం లేదు అనే విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈ మంచి నీటి సరఫరా చేసిన వాళ్లకు బిల్లులు కూడా అందుకే ఆగాయా?. లేక తెలంగాణ ప్రభుత్వం దగ్గర సెక్రటేరియట్ కు వాటర్ సప్లై చేసిన వాళ్లకు ఇచ్చేందుకు 50 లక్షల రూపాయలు కూడా లేవా అన్న చర్చ ఇప్పుడు తెరమీదకు వచ్చింది.
గత బిఆర్ఎస్ ప్రభుత్వం లో అయినా..ఇప్పుడు అయినా కూడా ప్రైవేట్ సంస్థలు పెట్టే పెట్టుబడులను తమ గొప్పలుగా చెప్పుకుంటూ ప్రచారం చేసుకోవటం తప్ప...ప్రభుత్వపరంగా చేస్తున్న పనులు పరిమితంగానే ఉంటున్నాయి అని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అదే సమయంలో పారిశ్రామిక సంస్థలకు ఇవ్వాల్సిన రాయితీలు కూడా పెద్ద ఎత్తున బకాయిలు ఉన్నట్లు చెపుతున్నారు. ఇక్కడ మరో విచిత్రం ఏమిటి అంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు పెద్ద పెద్ద బిల్డింగ్ లు కట్టించి ఎవరి కమిషన్లు వాళ్ళు తీసుకుని కూర్చుంటున్నారు అని...తెలంగాణ లో కొత్తగా పలు జిల్లాల్లో కట్టిన ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ కార్యాలయాల్లో కనీస నిర్వహణను కూడా ఎవరూ పట్టించుకోవటం లేదు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. భారీ బిల్డింగ్ లు అయితే కట్టించారు కానీ...వీటిని నిర్వహణకు నిధుల కేటాయింపు లేకపోవటం ఇది ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది అధికారులు చెపుతున్నారు. సచివాలయంలో మంచి నీటి సరఫరాకు బిల్లులు చెల్లించకుండా ఉండటం..ఇది మీడియా లో ప్రముఖంగా రావటం చూస్తుంటే రాష్ట్రంలో పరిపాలన సాగుతున్న తీరును ఇది తెలియచేస్తుంది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.



