Telugu Gateway
Telangana

తెలంగాణ‌లో ప్ర‌తి ఏటా ఉద్యోగ ఖాళీల భ‌ర్తీ

తెలంగాణ‌లో  ప్ర‌తి ఏటా ఉద్యోగ ఖాళీల  భ‌ర్తీ
X

తెలంగాణ స‌ర్కారు మంగ‌ళ‌వారం నాడు కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ముఖ్య‌మంత్రి కెసీఆర్ అధ్య‌క్షత‌న జ‌రిగిన స‌మావేశంలో ప‌లు నిర్ణ‌యాలు తీసుకున్నారు. అన్ని రకాల పోస్టుల్లో ఖాళీలను గుర్తించిన తర్వాత ప్రతి సంవత్సరం రిక్రూట్ మెంట్ కోసం 'వార్షిక క్యాలెండర్ ' ను తయారు చేయాలని కేబినెట్ అధికారులను ఆదేశించింది. ప్రతి సంవత్సరం ఖాళీల భర్తీ కోసం 'వార్షిక నియామక కేలెండర్' (జాబ్ కేలెండర్) ను తయారు చేసి అందుకు అనుగుణంగా విధిగా భర్తీ ప్రక్రియ నిర్వహించాలన్నారు. ఉద్యోగ ఖాళీల భర్తీకై చేపట్టాల్సిన చర్యలు, ఖాళీల గుర్తింపుఅంశంపై చ‌ర్చించేందుకు బుధ‌వారం నాడు కూడా కేబినెట్ సమావేశం కొనసాగనుంది. ఈ సమావేశానికి అన్ని శాఖల కార్యదర్శులను పూర్తి వివరాలతో హాజరు కావాలని కేబినెట్ ఆదేశించింది. మంగ‌ళ‌వారం నాడు మంత్రివ‌ర్గ స‌మావేశంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితి పై మంత్రివ‌ర్గ సమావేశంలో చర్చ జరిగింది.ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఏడు జిల్లాలలో పర్యటించి వచ్చిన ఆరోగ్యశాఖ కార్యదర్శి ఇతర అధికారులు, ఆయా జిల్లాలలో నెలకొన్న కోవిడ్ పరిస్థితి, తీసుకున్న చర్యలు, నివారణకై ఇచ్చిన సూచనలు, తదితర క్షేత్రస్థాయి పరిశీలనలను, కేబినెట్ కు వివరించారు.

మందులు ఆక్సీజన్ లభ్యత, ఇతర మౌలిక వసతులు సౌకర్యాల పై కేబినెట్ పూర్తిస్థాయిలో చర్చించింది. వ్యాక్సినేషన్, పడకల లభ్యత, జౌషదాల లభ్యత సహా మూడో వేవ్' కు సంబంధించిన సన్నద్దత గురించి వైద్యరోగ్యశాఖ అధికారులు కేబినెట్ కు నివేదించారు. కేబినెట్‌ సమావేశంలో భాగంగా పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పురోగతిపై చర్చించిన కేసీఆర్‌.. హైదరాబాద్‌ నగర శివారులోని మున్సిపాలిటీల్లో మంచినీటి సమస్య నివారణ కోసం అదనంగా రూ.1200 కోట్లు మంజూరు చేశారు.నీటి ఎద్దడి నివారణకు తక్షణమే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మున్సిపాలిటీల అభివృద్ధి కోసం ల్యాండ్‌ పూలింగ్‌ వ్యవస్థ ద్వారా ప్రత్యేకంగా లేఅవుట్లను అభివృద్ధి చేయాలన్నారు. పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ శాఖలు అధికారులు కేబినెట్‌కు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పురోగతికి సంబంధించిన పలు నివేదికలు సమర్పించారు.

Next Story
Share it