Telugu Gateway
Telangana

తెలంగాణలో కోవాగ్జిన్ రెండవ డోస్ వాయిదా

తెలంగాణలో కోవాగ్జిన్ రెండవ డోస్ వాయిదా
X

దేశమంతటా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఓ ప్రహసనంగా మారింది. తాజాగా తెలంగాణ సర్కారు కోవాగ్జిన్ వ్యాక్సిన్ కు సంబంధించి కీలక ప్రకటన చేసింది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ నుంచి నిల్వలు రానందున తెలంగాణలో45 సంవత్సరాలు పైబడిన వారికి రెండవ డోసు కోవాగ్జిన్ వ్యాక్సినేషన్ ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఎప్పుడు వ్యాక్సినేషన్ ను తిరిగి ప్రారంభించేది త్వరలోనే వెల్లడిస్తామని ఓ ప్రకటనలో తెలిపింది.

ఇప్పటికే తొలి డోసు తీసుకున్న వారికి నిర్దేశిత సమయం ప్రకారం రెండవ డోసు ఇవ్వాలి కానీ..కేంద్రం ఇవ్వలేదు కాబట్టి వ్యాక్సినేషన్ ఆపేస్తున్నాం అంటే..తొలి డోసు తీసుకుని రెండవ డోసు కోసం వేచిచూసే వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారే అవకాశం ఉంది. కోవాగ్జిన్ ఫస్ట్ డోస్ కు ..రెండవ డోసుకు మధ్య వ్యవధి నాలుగు నుంచి ఆరు వారాలు మాత్రమే ఉన్న విషయం తెలిసిందే.

Next Story
Share it