Telugu Gateway
Telangana

ద‌ళిత‌బంధు అమ‌లుకు 250 కోట్లు విడుద‌ల‌

ద‌ళిత‌బంధు అమ‌లుకు 250 కోట్లు విడుద‌ల‌
X

తెలంగాణ స‌ర్కారు ద‌ళిత‌బంథు ప‌థ‌కం అమ‌లుకు తిరిగి చ‌ర్య‌లు ప్రారంభించింది. గ‌త కొంత కాలంగా ఈ ప‌థ‌కం అమ‌లు నిలిచిపోయింది. తాజాగా తిరిగి దీనికి నిధులు కేటాయింపు చేశారు. ద‌ళితబంధు పథకం అమలుకు సీఎం కెసీఆర్ ముందు ప్ర‌క‌టించిన‌ట్లుగా నాలుగు జిల్లాలలోని నాలుగు మండలాలకు ఎస్సీ కార్పోరేషన్ నిధులను విడుదల చేశారు. నిధులను ఆయా జిల్లా కలెక్టర్ల ఖాతాల్లో జమ చేసింది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమ‌లగిరి మండలంలో దళిత బంధును సంతృప్త స్థాయిలో అమలు చేసేందుకు 50 కోట్ల రూపాయ‌లు, ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలంలో దళిత బంధు అమలు కోసం 100 కోట్ల రూపాయ‌లు జ‌మ చేశారు.

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట కల్వకుర్తి నియోజకవర్గాల పరిధిలోని చారగొండ మండలంలో దళిత బంధు అమలుకోసం 50 కోట్ల రూపాయ‌లు, కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజక వర్గంలోని నిజాం సాగర్ మండలంలో దళిత బంధు అమలుకోసం 50 కోట్ల రూపాయ‌ల‌ను విడుద‌ల చేశారు. ఈ మొత్తాల‌ను ఆయా జిల్లాల కలెక్టర్ల ఖాతాల్లో తెలంగాణ షెడ్యూల్ కులాల ఫైనాన్స్ కార్పోరేషన్ మంగళవారం జమచేసింది. రాజ‌కీయంగా ఈ స్కీమ్ అత్యంత ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

Next Story
Share it