Telugu Gateway
Telangana

సూపర్ స్ప్రెడర్లకు ముందు వ్యాక్సిన్లు

సూపర్ స్ప్రెడర్లకు ముందు వ్యాక్సిన్లు
X

తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం

తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఎవరి వల్ల అయితే ఎక్కువ మందికి కరోనా విస్తరించే అవకాశం ఉందో ఆయా వర్గాలకు తొలుత వ్యాక్సిన్ ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ కూడా ఇదే విషయాన్ని ప్రధాని నరేంద్రమోడీ దృష్టికి కూడా తీసుకెళ్లారు. అందులో భాగంగా ఎల్.పి.జి. డెలివరీ సిబ్బంది, చౌకధరల షాపు డీలర్లు, పెట్రోల్ పంప్ కార్మికులు, ఆటో, క్యాబ్ డ్రైవర్లు, రైతు బజార్లలోని విక్రేతలు, పండ్లు విక్రయదారులకు వ్యాక్సిన్ ఇవ్వనున్నారు.

వీరితోపాటు కూరగాయలు మరియు పూల మార్కెట్లు, కిరాణా షాపులు , మద్యం దుకాణాలు, మాంసాహార మార్కెట్ల లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి వ్యాక్సినేషన్ చేయాలని సీఎం కెసీఆర్ ఆదేశించారు. సూపర్ స్ప్రెడర్ల గుర్తింపు మరియు ఇతర లాజిస్టిక్ ఏర్పాట్లకు సంబంధించిన అంశాలపై మంగళవారం నాడు మంత్రి హరీష్ రావు నేతృత్వంలో సాగిన సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Next Story
Share it