Telugu Gateway
Telangana

బాణాసంచాపై నిషేధం..జీవో జారీ

బాణాసంచాపై నిషేధం..జీవో జారీ
X

తెలంగాణ సర్కారు బాణాసంచాపై నిషేధం విధిస్తూ శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం నాడు హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. పండుగలు ముఖ్యమే అయినా..దానికంటే ముందు ప్రాణాలు ముఖ్యం కదా అని కోర్టు వ్యాఖ్యానించింది. బాణాసంచా కాల్చటం వల్ల వచ్చే కాలుష్యంతో కరోనా కేసులు పెరిగే ప్రమాదం ఉందని..దీంతోపాటు శ్వాస కోస ఇబ్బందులు ఉన్న వారు మరింత ప్రమాదంలోకి వెళతారని దాఖలైన ప్రజాప్రయోజన వ్యాఖ్యం విచారించిన హైకోర్టు బాణాసంచా అమ్మకాలు, వినియోగంపై నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో టపాసుల అమ్మకాలపై నిషేధం ఉందని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తెలిపారు. టపాసుల అమ్మకాలతో పాటు కాల్చడం కూడా నిషేధమన్నారు. క్రాకర్స్‌ షాపులను మూసివేయాలని ఆదేశించారు.

Next Story
Share it