Telugu Gateway
Telangana

తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ మే 8 వరకూ పొడిగింపు

తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ మే 8 వరకూ పొడిగింపు
X

రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూను మరోవారం పొడిగిస్తూ సర్కారు నిర్ణయం తీసుకుంది. మే 8 వరకూ ఈ పొడిగింపు అమల్లో ఉండనుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు అన్ని జిల్లాలో పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీీలు రాత్రి కర్ఫ్యూ అమలు విషయంలోో కఠిన చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యల అంశంపై హైకోర్టులో శుక్రవారం నాడు మరోసారి విచారణ జరిగింది. రాత్రి కర్ఫ్యూ ముగియడానికి 24 గంటల సమయం కూడా లేదు.. ప్రభుత్వం తదుపరి చర్యలపై ఇంకా నిర్ణయం తీసుకోకపోవడం ఏమిటని కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. 45 నిమిషాల్లోగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే తాము ఆదేశాలు ఇస్తామని స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంసలో ప్రభుత్వం కర్ఫ్యూ పొడగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయం తెలపకపోయినట్లైతే పరిస్థితి వేరేలా ఉండేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. తమ సహనాన్ని పరీక్షించవద్దని కోర్టు ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఇక నుంచి అయిన కరోనా నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను కోర్టు మే 5కు వాయిదా వేసింది.

Next Story
Share it