Telugu Gateway
Telangana

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సర్ప్రైజ్

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సర్ప్రైజ్
X

నామినేషన్లకు ఒక రోజు ముందు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా వచ్చింది. ఇందులో ముందు నుంచి చెప్పుకుంటున్న అద్దంకి దయాకర్ కు ఈ సారి ఛాన్స్ దక్కింది. గత ఎన్నికల్లో ఆయనకు సీటు కేటాయించలేకపోవటం పాటు కీలకమైన కార్పొరేషన్ పదవి కూడా ఆయనకు దక్కలేదు. దీంతో ఈ సారి ఆయనకు కచ్చితంగా ఎమ్మెల్సీ సీటు ఇస్తారని భావించారు. అధిష్టానం కూడా అదే దిశగా నిర్ణయం తీసుకుంది. అయితే అందరిని ఆశ్చర్య పరిచిన పేరు అంటే ఖచ్చితంగా విజయశాంతి దే అని చెప్పాలి. ఎందుకంటే ఆమె కు సీటు దక్కుతుంది అని ఎవరూ ఊహించలేదు.

ఇటీవల ఆమె రేస్ లో ఉన్నట్లు వార్తలు వచ్చినా కూడా తుది జాబితాలో చోటు దక్కించుకోవటం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే పార్టీ లో చేరే సమయంలో ఇచ్చిన హామీ మేరకు విజయశాంతికి ఎమ్మెల్సీ కేటాయించారు అనే చర్చ పార్టీ నేతల్లో సాగుతోంది. అధిష్టానం కోటా లో ఆమె కు సీటు దక్కింది అని భావిస్తున్నారు. మరో సీటు ను శంకర్ నాయక్ కు కేటాయించారు. పొత్తులో భాగంగా ఒక సీటు ను సిపిఐ కి కేటాయించారు. తెలంగాణ లో మొత్తం ఐదు సీట్లకు ఎన్నికలు జరగనుండగా మొత్తం నాలుగు సీట్లు కాంగ్రెస్ కు..ఒకటి ప్రతిపక్ష బిఆర్ఎస్ కు దక్కనుంది. బిఆర్ఎస్ కు దక్కే ఒక సీటు కోసం దాసోజు శ్రావణ్ ను ఆ పార్టీ అధినేత కెసిఆర్ ఎంపిక చేశారు.

Next Story
Share it