Telugu Gateway
Telangana

ఏపీ ప్రాజెక్టుల‌పై తెలంగాణ పిర్యాదు

ఏపీ ప్రాజెక్టుల‌పై  తెలంగాణ పిర్యాదు
X

అక‌స్మాత్తుగా తెలంగాణ‌, ఏపీల మ‌ధ్య జ‌ల జ‌గ‌డం ప్రారంరభం అయింది. ఇరు రాష్ట్రాల నేత‌ల‌పై ఒక‌రిపై ఒక‌రు తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించుకుంటున్నారు. విమ‌ర్శలు చేసుకునే వాటిలో కొత్త‌గా ప్రారంభం అయిన‌వి ఏవీ లేవు. కానీ స‌డ‌న్ గా ఈ అంశంపై తెర‌పైకి వ‌చ్చింది. ఓ వైపు రాజ‌కీయ విమ‌ర్శ‌లు సాగుతుండ‌గా..మ‌రో వైపు అధికారికంగానూ ఫిర్యాదులు మొద‌ల‌య్యాయి. కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం మంగ‌ళ‌వారం నాడు లేఖ రాసింది. బోర్డు చైర్మన్‌కు నీటిపారుదలశాఖ స్పెషల్‌ సెక్రటరీ రజత్‌కుమార్ ఈ లేఖ రాశారు. అనుమతుల్లేకుండా ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పోతిరెడ్డిపాడు విస్తరణ పనులపై ఫిర్యాదు చేసింది.

ఎన్జీటీ స్టే విధించినా పనులు కొనసాగుతున్నాయని, కృష్ణా బోర్డు వాటిని అడ్డుకోలేకపోయిందని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. డీపీఆర్ కోసం సన్నాహకాలంటూ ప్రాజెక్టు పనులను కొనసాగిస్తున్నారని ఆందోళ‌న‌ వ్యక్తం చేసింది. ఎన్జీటీ ఆదేశాల మేరకు కృష్ణా బోర్డు కనీసం నిజనిర్ధారణ కమిటీని కూడా పంపలేకపోయిందని లేఖలో పేర్కొంది. తెలంగాణ కేబినెట్‌ భేటీలో ఏపీ వైఖరిని తీవ్రంగా నిరసించింది. ఏపీ చర్యలతో తెలంగాణలో కృష్ణా బేసిన్‌లో ఉన్న కరవు, ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలు హైదరాబాద్ తాగునీటి అవసరాలపై ప్రభావం పడుతుందని తెలంగాణ కేబినెట్ పేర్కొందన్నారు. ఏపీ అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను తక్షణమే ఆపాలని రజత్ కుమార్ కోరారు. అయితే ఏపీ మాత్రం త‌మ‌కు కేటాయించిన నీటిని త‌ప్ప‌..అద‌నంగా ఒక్క చుక్క కూడా తీసుకోబోమ‌ని..త‌మ కేటాయింపుల‌నే వాడుకుంటామ‌ని చెబుతుంది.

Next Story
Share it