కొత్త సచివాలయం పనులపై విచారణ
BY Admin10 Feb 2024 6:23 PM IST
X
Admin10 Feb 2024 6:23 PM IST
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొత్త సచివాలయంతో పాటు అంబేద్కర్ విగ్రహం, అమర జ్యోతి నిర్మాణాలపై కూడా విచారణకు ఆదేశించనున్నట్లు వెల్లడించారు. పది పైసలతో అయ్యే పనికి పది రూపాయలు ఖర్చుపెడితే అద్భుతం అవుతుందా అని అయన ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా కూడా అమరవీరుల స్మారకం విషయంలో అవినీతి జరిగింది అని ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దానితో పాటు సచివాలయం, అంబేద్కర్ విగ్రహం నిర్మాణాలపై కూడా విచారణ జరిపించనున్నారు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్ట్ పై జ్యూడిషయల్ విచారణ జరిపించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ విచారణలు అన్ని పూర్తి అయితే ఎన్ని విషయాలు బయటకు వస్తాయో చూడాలి.
Next Story



